US Operation : కిమ్‌కే ఎర్త్ పెడదామని ట్రై చేసిన ట్రంప్.. ఆరుగురు సీల్ కమాండోలు ఎంట్రీ.. కట్ చేస్తే..

US Operation : డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత ఉత్తర కొరియా సీక్రెట్ సమాచారాన్ని సేకరించాలని ఓ ఆపరేషన్ నిర్వహించారు.

US Operation : కిమ్‌కే ఎర్త్ పెడదామని ట్రై చేసిన ట్రంప్.. ఆరుగురు సీల్ కమాండోలు ఎంట్రీ.. కట్ చేస్తే..

US Operation

Updated On : September 7, 2025 / 2:02 PM IST

US Operation : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించిన ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను నిరోధించే ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆ దేశంలో అమర్చాలని అమెరికా భావించింది. తద్వారా ఉత్తర కొరియా సీక్రెట్ సమాచారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదంతో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ కోసం సీల్ యూనిట్ కమాండోలు కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేశారు. ఓ రోజు రాత్రి సీల్ కమాండోలు తమ ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ, ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వారి ప్రయత్నాలను అడ్డుకుంది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్ వివరాలను తాజాగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

Also Read: Coldplay : సీఈవోతో సరసాల ఎఫెక్ట్.. క్రిస్టీన్‌ కాబోట్‌కు మరో బిగ్‌షాక్.. విడాకులిచ్చేందుకు సిద్ధమైన భర్త

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికా, ఉత్తర కొరియా మధ్య 2018లో దౌత్య చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరకొరియాలో నిఘా పరికరాన్ని అమర్చాలని అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించింది. అక్కడి నుంచి రెండు మినీ సబ్‌మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకొని నిఘా పరికరాన్ని అమర్చాలనేది ప్లాన్.

అయితే, ఇలాంటి ఆపరేషన్లు చేపట్టాలంటే అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆమోదంతో ఈ ఆపరేషన్‌ను మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ బాధ్యతలను ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన రెడ్ స్క్వాడ్రన్ యూనిట్‌లోని సీల్ బృందానికి వైట్‌హౌస్ అప్పగించింది.

 

ఈ ఆపరేషన్ విజయవంతం కోసం సీల్ యూనిట్ కమాండోలు కొన్ని నెలలపాటు రిహార్సల్స్ చేశారు. ఉత్తరకొరియాలో సరిహద్దు ఆంక్షల కారణంగా డ్రోన్లు, ఇతర టెక్నాలజీని వినియోగించే అవకాశం లేకపోవడంతో వాళ్లకు ఈ ఆపరేషన్ పెద్ద సవాలుగా మారింది. అయినా ఆపరేషన్ కొనసాగించాలని వైట్‌హౌస్ నిర్ణయించింది.

2019లో కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ వియత్నాంలో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే సిల్ కమాండోలు తమ ఆపరేషన్ ను విజయవంతం చేయాలని అనుకున్నారు. అందుకోసం రంగం సిద్ధం చేసుకున్నారు.

ఓరోజు రాత్రి ఆరుగురు సీల్ కమాండోలు బృందం తమ ఆపరేషన్‌ను మొదలు పెట్టింది.. బ్లాక్ సూట్‌లు, నైట్ విజన్ అద్దాలు, నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించి ఉత్తరకొరియా సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ నిఘా పరికరాన్ని అమర్చే సమయంలో వాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది. దీంతో సిల్ కమాండోల ఆపరేషన్ విఫలమైంది.

ఉత్తర కొరియా సముద్ర తీరంలో నిఘా పరికరాన్ని అమర్చేందుకు సీల్ కమాండోలు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వాళ్లకు సమీపంలోకి వచ్చింది. ఆ బోటులోని సిబ్బంది సీల్ కమాండోలు ఉన్న ప్రదేశం వైపు ప్లాష్‌లైట్‌లు వేశారు. దీంతో ముప్పు పొంచిఉందని భావించిన సిల్ కమాండోలు బోటులోని వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారు చనిపోయారు.

ఈ పరిణామంతో నిఘా పరికరాన్ని అమర్చకుండానే సీల్ కమాండోలు ఆపరేషన్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడి నుంచి వచ్చేశారు. అలా అమెరికా ఆపరేషన్ విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ మిషన్ కు సంబంధించి 25మందికిపైగా అధికారులు, సైనిక సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినట్లు తన కథనంలో పేర్కొంది.

అయితే, ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఈ విషయాలేవీ తనకు తెలియవని సమాధానం దాటవేశారు.