Coldplay : సీఈవోతో సరసాల ఎఫెక్ట్.. క్రిస్టీన్‌ కాబోట్‌కు మరో బిగ్‌షాక్.. విడాకులిచ్చేందుకు సిద్ధమైన భర్త

Coldplay : కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో సీఈవో ఆండీతో సరసాలాడుతూ ఆస్ట్రానమర్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.

Coldplay : సీఈవోతో సరసాల ఎఫెక్ట్.. క్రిస్టీన్‌ కాబోట్‌కు మరో బిగ్‌షాక్.. విడాకులిచ్చేందుకు సిద్ధమైన భర్త

Coldplay

Updated On : September 7, 2025 / 1:22 PM IST

Coldplay : కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో సీఈవో ఆండీతో సరసాలాడుతూ ఆస్ట్రానమర్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వీరి సరసాలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటన తరువాత ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే, తాజాగా.. ఆమెకు విడాకులిచ్చేందుకు భర్త ఆండ్రూ కాబోట్ సిద్ధమయ్యాడు. విడాకులకోసం దరఖాస్తు సైతం చేశాడు. దీంతో ఆమె వైవాహిక జీవితం కష్టాల్లో పడింది.

Also Read: Elon Musk: బాబోయ్.. లెక్కపెట్టలేనంత జీతం..! ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ ఆఫర్.. కానీ, షరతులు వర్తిస్తాయ్.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

అసలేం జరిగింది..?

ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ, అదే సంస్థలో పనిచేస్తున్న హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ ‘కోల్డ్‌ప్లే’ కాన్సర్ట్‌లో ఒకరికొకరు సన్నిహితంగా ఉన్న సమయంలో స్పాట్ లైట్‌కు చిక్కారు. స్పాట్‌లైట్ పడగానే వారిద్దరూ ముఖం దాచుకొని ప్రేక్షకుల్లో కలిసిపోయారు. అయితే, అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది. వీరిద్దరి వివాహేతర సంబంధం వెలుగులోకి రావడంతో.. ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఆ తరువాత సీఈవో పదవికి ఆండీ రాజీనామా చేశాడు. కొద్దిరోజుల తరువాత క్రిస్టీన్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయింది.

 

విడాకులిచ్చేందుకు సిద్ధమైన భర్త..

ఆండీకి మేగన్ కెర్రిగాన్‌తో ఇప్పటికే వివాహం అయింది. ఇక క్రిస్టీన్ కాబోట్‌కు ప్రైవేటీకర్ రమ్ కంపెనీ సీఈవో ఆండ్రూ కాబోట్‌తో వివాహం జరిగింది. ఆండీ, క్రిస్టీన్‌ సరసాలకు సంబంధించిన వీడియో ప్రపంచం మొత్తం వైరల్ కావడంతో క్రిస్టీన్‌కు విడాకులిచ్చేందుకు ఆమె భర్త ఆండూ కాబోట్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశాడు. దీంతో ఆమె వైవాహిక జీవితం కష్టాల్లో పడింది. అయితే, క్రిస్టిన్ కాబోట్ కూడా తన భర్తతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. గత నెల 13న న్యూ హాంప్‌షైర్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది.

ఆండ్రూ కాబోట్ నగరంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ రమ్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు ఇప్పటికే ఇద్దరితో విడాకులయ్యాయి. అయితే, క్రిస్టీన్ తో వివాహ బంధం సజావుగా సాగుతున్న సమయంలో ఆమె తన కంపెనీ సీఈవోతో సరసాలాడుతున్న వీడియో బయటకు రావడంతో విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆయనకు ఇది మూడో విడాకులు.

ఆండ్రూ కోబాట్ క్రిస్టీన్ కు విడాకులు ఇచ్చే విషయాన్ని అతని మాజీ భార్య జూలియా డెయిలీ మెయిల్‌కు వెల్లడించింది. ‘కోల్డ్‌ప్లే వీడియో వెలుగులోకి రాగానే తన మాజీ భర్త ఆండ్రూ కోబాట్ కు నేను మెసేజ్ చేశాను. దీనికి అతడు స్పందిస్తూ.. ఆమె (క్రిస్టీన్)కు ఇకనుంచి నాతో ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం విడిపోతున్నాం’ అని చెప్పాడు అంటూ జూలియా పేర్కొంది. అయితే, ఆండ్రూ కోబాట్ భర్తకు తగిన వ్యక్తి అని నేను అనను. కానీ, ఆమె కూడా భార్యకు తగిన వ్యక్తిలా కనిపించడం లేదు అంటూ జూలియా వ్యాఖ్యానించింది. వారు వివాహం చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమెతో ఎటువంటి సంబంధం లేదని అతను చెబుతున్నాడు. కానీ, అతను కేవలం డబ్బుపై మాత్రమే శ్రద్ధ చూపుతాడు. నువ్వు ఏమి ఇస్తే అది నీకు దక్కుతుంది అన్నట్లుగా.. ఆండ్రూ కాబోట్‌కు ‘కర్మ’ సిద్ధాంతం సరిగా వర్తిస్తుంది అంటూ జూలియా తన మాజీ భర్త ఆండ్రూపై విమర్శలు చేసింది.