Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి
చైనాలో హుబే ప్రావిన్స్‌కు చెందిన వధువు తన భర్త బహుకరించిన 60 కేజీల బంగారాన్ని వంటినిండా దిగేసుకొని కారులోంచి దిగి మండపం ఎక్కింది.
- kunduru Vinod
- Updated on- October 13, 2021 / 10:46 PM IST
Golden Bride
Golden Bride : 60 కేజీల బంగారు ఆభరణాలు ధరించి పెళ్లి వేదిక ఎక్కింది వధువు. చైనాలో హుబే ప్రావిన్స్‌కు చెందిన వధువు తన భర్త బహుకరించిన 60 కేజీల బంగారాన్ని వంటినిండా దిగేసుకొని కారులోంచి దిగి మండపం ఎక్కింది. వెళ్లివేడుకకు వచ్చిన అతిధులు ఆమె వంటిపై ఉన్న బంగారం చూస్తూ ఉండిపోయారు.
చదవండి : వెంకయ్య అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం..ధీటుగా బదులిచ్చిన భారత్
కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బంగారు వధువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వరుడుకి హుబే ప్రావిన్స్‌లో వ్యాపారవేత్తగా తెలుస్తోంది. ఒక్కొక్కటి కేజీ బరువున్న 60 బంగారు నెక్లెస్‌లను పెండ్లికొడుకు ఆమెకు కానుకగా అందించాడు. వాటికి తోడు ఆమె రెండు చేతుల నిండా బంగారు గాజులు ధరించింది.
చదవండి : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు
