China Army : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రంలో కొన్ని రోజులుగా చైనా ఆర్మీ డ్రిల్స్‌ చేస్తోంది.

China Army : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు

China (2)

China Army stunts  : దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రంలో కొన్ని రోజులుగా చైనా ఆర్మీ డ్రిల్స్‌ చేస్తోంది. తైవాన్‌ను కవ్వించేలా ఆ డ్రిల్స్‌కు సంబంధించిన వీడియోను డ్రాగన్‌ కంట్రీ పోస్ట్ చేసింది.

తైవాన్‌ గగనతలంలోకి వారం రోజులుగా యుద్ధ విమానాలు పంపుతున్న చైనా.. తైవాన్‌కు 180కిలోమీటర్ల దూరంలోని దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించి తైవాన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. యుద్ధానికి సిద్ధం అనే రేంజ్‌లో ఓ ఎడిటెడ్‌ వీడియోను పోస్ట్ చేయడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచుతోంది. ఎప్పుడు ఏ క్షణంలోనైనా తైవాన్‌పై చైనా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.

Andhra Pradesh : విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్..కరెంట్‌ కోతలు తప్పవా?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నిరంకుశంగా ఆలోచిస్తున్నారంటూ తైవాన్‌ అధ్యక్షురాలు సై వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే చైనా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియో బట్టి చూస్తే చాలా రోజులుగా చైనా ఆర్మీ ఫ్యూజియాన్‌ రీజియన్‌లో డ్రిల్స్‌ నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతోంది. తైవాన్‌ నుంచి ఫ్యూజియాన్‌ సముద్రపు సరిహద్దుకు కేవలం 180కిలోమీటర్లే దూరం.

ఇక డ్రాగన్‌ సైన్యం నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొంటామని తెలిపింది తైవాన్. పునరేకీకరణ కోసం ఆ దేశం తీసుకొస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేసింది. తైవాన్‌ ప్రజల సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా చైనా చర్యలున్నాయని ఫైర్‌ అయ్యింది.