కెమికల్ రేడియేషన్ ఎఫెక్ట్ : వీధుల్లో బ్లూ డాగ్స్.. వింతగా చూస్తున్న ఊరిజనం

Bright Blue Dogs Spotted Roaming : ఆ ఊరిలో కుక్కలన్నీ రంగు మారిపోతున్నాయి. ఉన్నట్టుండి ముదురు నీలం రంగులోకి కుక్కలు మారిపోయాయి. బ్లూ రంగులో మెరిసిపోతున్న కుక్కలను అక్కడి ఊరిజనం వింతగా చూస్తున్నారు. మూతపడ్డ కెమికల్ ప్లాంట్ సమీపంలో ఈ బ్లూ డాగ్స్ తిరుగుతున్నాయని అంటున్నారు. అసలు ఎందుకిలా కుక్కలు నీలం రంగులోకి మారిపోయాయి. వాటిపై జుట్టంతా నీలం రంగులో కనిపిస్తుందో అంతుపట్టడం లేదంటున్నారు. రష్యాలోని డిజెర్జిన్స్ ప్రాంత నివాసులంతా వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో సైన్స్ ఫిక్షన్, రేడియేషన్ ప్రభావిత మ్యుటేసన్ మాదిరిగా కనిపిస్తోంది. కెమికల్ ప్లాంట్ నుంచి విడుదలైన విష రసాయనాల కారణంగానే ఈ కుక్కలన్నీ ఇలా నీలం రంగులోకి మారిపోయాయని అంటున్నారు. గతంలో 2015లో మూసివేసిన ఆర్గ్‌స్టెక్లో యాజమాన్యంలో కర్మాగారం ప్లెక్సిగ్లాస్ హైడ్రోసియానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుండేది. కెమికల్ తయారీలో ఉపయోగించే రాగి సల్ఫేట్‌కు కుక్కలు బహిర్గతమయ్యే అవకాశం ఉందంటున్నారు. లేత-నీలం రంగు కుక్కల జుట్టుపై రాగి సల్ఫేట్ ద్రావణం అంటుకోవడం ద్వారా ఇలా మారి ఉండొచ్చునని చెబుతున్నారు.


డిజెర్జింకోయ్ ప్రాంత అధికారులు ఆర్గ్‌స్టెక్లోతో కెమికల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఇలాంటి రసాయనాలు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయని, వెంటనే కార్యాకలాపాలు నిలిపివేయాలని సూచించారు. జంతు పరిరక్షకకులు కుక్కలకు ఆశ్రయం కల్పించారు. ఈ రసాయనాలు కుక్కల చర్మానికి హాని కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాని పశువైద్య సిబ్బంది పరీక్షించిన తరువాత మొత్తం 7 కుక్కలు ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది.


వీధి కుక్కలపై కనిపించే ఇలాంటి రంగుల ఘటనలు గత ఏళ్లలోనూ చాలాసార్లు కనిపించాయని చెబుతున్నారు. ముఖ్యంగా 2017 లో ముంబైలో నీలం కుక్కలను గుర్తించారు. కెమికల్ ప్లాంట్ నుంచి నదిలోకి కెమికల్స్ పంపుతున్నట్టు గుర్తించారు. ఆ నదిలో దిగిన 11 వీధి కుక్కలు రంగులు మారడంతో స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకిత్తించింది. దర్యాప్తు అనంతరం మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సదరు ప్లాంటును మూసివేసింది.