Britain 81 year old woman who wed 36 year old man : ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఈడూ జోడు బాగుందే అంటాం. కానీ ఓ జంటను చూస్తే జోడు ఎలాఉన్నా ఈడు (వయస్సు) గురించి వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె వయస్సు 81 ఏళ్లు..జీవితం మలిదశలో ఉంది. కానీ అతని వయస్సు మాత్రం 36 ఏళ్లు. నవ యువకుడు కాకపోయినా యువకుడే. వీరిద్దరూ గత నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం కావటం విశేషం..!! ఏంటీ..ప్రేమకు వయస్సుతో పనేముంది అంటారా? ఓకే..గానీ 36 ఏళ్ల యువకుడ్ని పెళ్లి చేసుకున్న ఈ 81 ఏళ్ల బామ్మ తమ దాంపత్యం గురించి చెప్పే మాటలు..ముఖ్యంగా వారి ఫస్ట్ నైట్ గురించి చెప్పే మాటలు వింటేమాత్రం దిమ్మ తిరిగిపోతుంది..! ఈ వయస్సులో కూడా బామ్మ ఇంత రొమాంటిక్కా..అనిపిస్తుంది..
డబ్బు స్వార్థం కోసమే ఈజిప్ట్‌కు చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకున్నాడన్న వార్తలను ఐరిస్ తీవ్రంగా ఖంచించింది. 36 ఏళ్ల వయసున్న తన ప్రేమికుడు అహ్మద్ ఇబ్రహీం చాలా నిజాయితీ పరుడని..తనను నిజంగానే ప్రేమించాడని చెబుతోంది ఐరిస్. గత ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్న ఐరిస్ తన సెక్సువల్ లైఫ్ ఐరిస్ ఘాటు ఘాటుగా వెల్లడించారు. ‘మా ఫస్ట్ నైట్ ఎంతో వైల్డ్ సెక్స్లా సాగిందని ఆమె చెప్పారు.
ఈజిప్ట్‌లో మొదటిసారి కలిసినప్పుడు చాలాబాగా ఎంజాయ్ చేశామని..చాలా చాలా ‘వివరం’ (చాలా బోల్డ్ గా ) గా చెప్పుకొచ్చింది. కాగా..అహ్మద్ ప్రస్తుతం ఈజిప్ట్‌లో ఉన్నాడు. బ్రిటన్ లో ఉన్న భార్య దగ్గరకు రావాలని ఉబలాటపడుతున్నాడు. కరోనా వల్ల విమానాలు నిలిచిపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో పాపం 81 ఏళ్ల బామ్మగారు భర్త మీద బెంగ పెట్టేసుకుంది. యువ భర్త కోసం తెగ విరహం అనుభవిస్తోందట. ఆమె భర్త గురించి చెప్పిన బోల్డ్ నెస్ కు ఇంటర్వ్యూ చేసే యాంకరే సిగ్గు పడిపోయింది. ముసి ముసిగా నవ్వేసుకుంది.
వారి సంబంధంపై విమర్శలు వస్తుండడంతో ఐరిస్ ఫేస్బుక్లో స్పందిస్తూ తన భర్తను స్కామర్ అన్న వారిపై విరుచుకుపడ్డారు. “భూమి మీద అత్యంత ఎక్కువ ప్రేమించే వ్యక్తి, నిజాయితీ అయిన వ్యక్తి నా భర్త మహమ్మద్. పెళ్లికి ముందే అతడిని అన్ని విషయాలను అతడికి అర్థమయ్యేలా చెప్పా.
అన్నింటికీ అంగీకరించే నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అతడి నిజాయితీ పట్ల నాకు ఎటువంటి అనుమానాలు లేవు. మాది మహమ్మద్ది నిజమైన ప్రేమ” అని ఐరిస్ చాలా చాలా నమ్మకంగా చెప్పారు. ఎవరి ఎన్నిరకాలుగా మాట్లాడినా మా దాంపత్యాన్ని విడదీయలేరని చెబుతున్నారు ఐరిస్.
కరోనా వల్ల తమ మధ్య వచ్చిన ఎడబాటు చాలా చాలా బాధగా ఉందంటున్నారు ఐరిస్. కన్నీళ్లు పెట్టుకున్నారు.నేను ప్రేమించే వ్యక్తి నుంచి దూరంగా ఉన్నా..ఇది చాలా కష్టంగా ఉంది. నిరంతరం అతని ఆలోచనలతో తలనొప్పి వచ్చేస్తోంది. అతడు నా దగ్గర లేకపోవటంతో ఆరోగ్యం బాగుండటంలేదు. ఎప్పుడు వస్తాడనా వేయికళ్లతో వేచి చూస్తున్నా..అతను రాగానే కౌగిలిలో వాలిపోవాలి..ఎడబాటు బాధనంతా తీర్చుకోవాలని ఆర్థ్రంగా చెబుతోంది ఈ 81 ఏళ్ల ముదిమి..