Britain : అప్పుడు మాస్క్‌‌లు, ఇప్పుడు హోం క్వారంటైన్‌‌కు గుడ్ బై

కరోనా వైరస్ మాత్రం హఠాత్తుగా అదృశ్యం కాదని, దానితో కలిసి బతుకుతూ కాపాడుకొనే ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోస్...

  • Published On : February 21, 2022 / 07:34 AM IST

britain

Britain Covid 19 Plan : ప్రపంచాన్ని ఇంకా కరోనా భూతం వీడడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో.. పలు దేశాలు ఆంక్షలు, నిబంధనలు సడలిస్తున్నాయి. బ్రిటన్ దేశంలో కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు సడలిస్తూ బ్రిటన్ ప్రభుత్వం దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది.

Read More : Boris Johnson: కొవిడ్ రూల్స్ పాటించక్కర్లేదు.. మాస్కులు పెట్టుకోండి చాలు – బ్రిటన్ ప్రధాని

ఇకపై కరోనా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, బయట తిరిగేందుకు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా..కోవిడ్ – 19 సోకితే 10 రోజులు హోం క్వారంటైన్ ఉండాలనే నిబంధనలు కూడా ఎత్తివేసింది. కోవిడ్ కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రం అని, వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కోవిడ్ తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.

Read More : Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మాత్రం హఠాత్తుగా అదృశ్యం కాదని, దానితో కలిసి బతుకుతూ కాపాడుకొనే ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోస్ పూర్తయ్యిందని, 85 శాతం మంది రెండు డోస్ లు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉంటే… బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కు కోవిడ్ పాజిటివ్ సోకినట్లు, ప్రస్తుతం ఆమెకు లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయని బకింగ్ హోమ్ వెల్లడించింది. వైద్యులు నిరంతరం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. రెండు డోస్ లతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నా.. వైరస్ సోకడం గమనార్హం.