Boris Johnson: కొవిడ్ రూల్స్ పాటించక్కర్లేదు.. మాస్కులు పెట్టుకోండి చాలు – బ్రిటన్ ప్రధాని

బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్ ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు.

Boris Johnson: కొవిడ్ రూల్స్ పాటించక్కర్లేదు.. మాస్కులు పెట్టుకోండి చాలు – బ్రిటన్ ప్రధాని

New Project

Updated On : January 20, 2022 / 11:50 AM IST

Boris Johnson: బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్ ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు. ‘దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేవ్ తారా స్థాయికి చేరింది. ఇప్పటి నుంచి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం మాత్రమే చేయాలని ఎవరినీ అడగదు’ అని స్పష్టం చేశారు.

‘ప్రపంచంలో వ్యాక్సిన్ అందించిన తొలి దేశం యూకే మాత్రమే. సొంతగా వ్యాక్సిన్ తయారుచేసుకోవడం వల్లనే త్వరగా బయటపడగలిగాం. గత వేసవిలో కార్యకలాపాలు పున ప్రారంభించడం కఠినమైన నిర్ణయమే. ఇతర దేశాలు అలా చేయలేదు. కానీ, ఇప్పుడు శీతాకాలమైనా ఓపెన్ చేయగలుగుతున్నాం. ఇతర దేశాల్లో ఇంకా లాక్ డౌన్ నడుస్తూనే ఉంది. అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్​ అవతరించింది’ అని వెల్లడించారు.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్​ తెలిపారు. బూస్టర్​ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్​ నుంచి బయటపడగలిగిన తొలి దేశంగా నిలిచిందని బోరిస్ వివరించారు. కోవిడ్ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేశామని తెలియజేశారు.

ఇది కూడా చదవండి : భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే అతి పెద్ద సవాలుగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్.