Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్

బ్రిటన్ కు చెందిన 95ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ IIకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. లక్షణాల తీవ్రంగా లేకపోవడంతో సాధారణ విధులను కొనసాగిస్తున్నారని Windsor Castle....

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్

Elizabeth

Updated On : February 20, 2022 / 6:16 PM IST

Queen Elizabeth: బ్రిటన్ కు చెందిన 95ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ IIకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. లక్షణాల తీవ్రంగా లేకపోవడంతో సాధారణ విధులను కొనసాగిస్తున్నారని Windsor Castle రెసిడెన్స్ వర్గాలు వెల్లడించాయి.

క్వీన్ పెద్ద కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ కు ఫిబ్రవరి 10న పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అని తెలియక రెండ్రోజులముందు తల్లిని కలిశారు ప్రిన్స్.

క్వీన్ ఎలిజబెత్ స్వయంగా టెస్టు చేసుకున్నారా.. వైద్యుల పర్యవేక్షణలో జరిగిందనే దానిపై కన్ఫర్మేషన్ లేదు.

Read Also: వయస్సు 56..78 సార్లు పాజిటివ్‌..14 నెలలుగా ఐసోలేషన్‌లో చికిత్స..!

‘బకింగ్ హామ్ ప్యాలెస్ ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు కన్ఫామ్ చేసింది. క్వీన్ కొవిడ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది’ అని స్టేట్మెంట్ విడుదల చేశారు. తేలికపాటి లక్షణాలతో కనిపిస్తున్నారని సాధారణ విధులు కొనసాగిస్తారని అందులో పేర్కొన్నారు.

సూచనలకు నిబంధనలకు అనుగుణంగా మెడికల్ అటెన్షన్ ను కొనసాగిస్తారని అధికారులు చెబుతున్నారు. క్వీన్ గతంలోనే పూర్తి కొవిడ్-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్నారని కన్ఫామ్ చేశారు.