Putin- Boris Johnson : ‘మీపై రాకెట్ దాడి చేయటానికి ఒక్క నిమిషం చాలు’ అని పుతిన్ బెదిరించారు : రష్యా అధ్యక్షుడిపై బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు

‘మీపై రాకెట్ దాడి చేయటానికి ఒక్క నిమిషం చాలు’ అని పుతిన్ తనను బెదిరించారు అంటూ రష్యా అధ్యక్షుడిపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు.

Putin- Boris Johnson : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై రష్యా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించకుముందే పుతిన్ తనను బెదరించారని…తనపై క్షిపణిని ప్రయోగిస్తానంటూ బెదిరించారు అంటూ బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంతో తనపై రాకెట్ ను ప్రయోగించటం నిమిషంలో పని అంటూ పుతిన్ తనను బెదిరించారంటూ ఆరోపించారు బోరిస్ జాన్సన్. యుక్రెయిన్ పైకి సైన్యాన్ని పంపించానికి ముందు రోజే పుతిన్ తనకు ఫోన్ చేసి మరీ బెదిరించారని ఆరోపించారు.

నా శతృవైన ఉక్రెయిన్ కు సహాయం చేస్తే రాకెట్ దాడి చేయటానికి కూడా వెనుకాడేది లేదనంటూ పుతిన్ బెదిరించారని అన్నారని కానీ పుతిన్ హెచ్చరికలకు తాను ఏమాత్రం భయపడనని.. భయపడేది లేదని స్పష్టంచేశారు ఓ డాక్యుమెంటరీలో వెల్లడించారు బోరిస్. పుతిన్ బెదిరింపులు పట్టించుకోకుండా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతు ఇచ్చానని తెలిపారు.

2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించే ఒకరోజు ముందు జాన్సన్‌కు పుతిన్ బెదిరింపు ఫోన్ కాల్ ద్వారా వచ్చిందని..ఫోన్ లో నన్ను పుతిన్ బెదిరించారని తెలిపారు బోరిస్ జాన్సన్. యుక్రెయిన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ యుక్రెయిన్ రాజధాని కీవ్ లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. ఈక్రమంలో అప్పడి బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ కు పుతిన్ ఫోన్ చేసి ‘‘బోరిస్..నేను మిమ్మల్ని బాధపెట్టాలనుకోవడం లేదు. కానీ క్షిపణితో దాడి చేయటానికి ఒక నిమిషం మాత్రమే పడుతుంది’’అని అన్నారని తెలిపారు బోరిస్. యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వటం మానుకోవాలని బెదరించారని తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు