విమానంలో భర్త చెంప ఛెళ్లుమనిపించిన భార్య..ఎందుకో తెలిస్తే ఇంకో రెండు తగిలించమంటారు

  • Publish Date - October 26, 2020 / 10:51 AM IST

Wife slaps husband on Easy Jet flight : ఇద్దరు భార్యాభర్తలు విమానం ఎక్కారు. ఎక్కిన తరువాత భర్త చెంప ఛెళ్లుమనించేలా భార్య ఒక్కటిచ్చుకుంది. దీంతో విమానంలో ఉన్నవారంతా హ్యాపీగా ఫీలయ్యారు..హా..ఇంకో రెండేయ్యమ్మా బాగా బుద్ధి వచ్చేలా అంటూ సూచించారు.




ఆ భర్త చేసిన పనేంటో తెలిస్తే మీరు కూడా అదే అంటారు..రెండు కాదు నాలుగు తగిలించు అంటారు. ఇంతకీ ఆ భార్య భర్తను ఎందుకలా కొట్టింది? అతనేం చేశాడో చూద్దాం..



https://10tv.in/woman-refuses-to-wear-mask-on-plane-coughs-on-passengers-yells-everyone-dies-when-deplaned/
బ్రిటన్‌లో మాంచెస్టర్ నుంచి టెనెరిఫీకి వెళ్లే విమానంలో సెస్టెంబర్ 6న ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు. ఆ భర్త మాస్కు పెట్టుకోలేదు..మాస్కు పెట్టుకోమని భార్య ఎంత చెప్పినా వినలేదు. విమానం ఎక్కారు..టేకాఫ్ కూడా అయ్యింది. అప్పుడు మొదలు పెట్టాడు ఆ భర్త రచ్చ చేయటం..


తాను మాస్కు పెట్టుకోలేని సరికదా..విమానంలో ఉన్న అందరూ మాస్కులు తీసేయండీ అంటూ లొల్లి మొదలుపెట్టారు. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదు. పిచ్చోళ్లలాగా ఎందుకు మూతులు..మొహాలు మూసుకుని తిరుగుతున్నారు? మాస్కులు తీసిపారేయండీ అంటూ అంటూ బూతులు తిడుతూ అరవడం మొదలు పెట్టాడు. అక్కడితో ఊరుకోకుండా తోటి ప్రయాణికుల మాస్కులు తీసేయటానికి యత్నంచాడు.


అది చూసిన విమానం సిబ్బంది అతడ్ని శతవిధాలా వారించినా వినలేదు. దీంతో భర్తను చూసిన ఆ భార్యకు మండిపోయింది. ఏంటీ నీ గోల..నువ్వు మాస్కు పెట్టుకోవు సరికదా..పెట్టుకున్నవారిని తీసేయమంటావేంటీ..నోర్మూసుకోమంటూ తిట్టిపోసింది.


అయినా కూడా అతగాడు వినలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులందరూ చూస్తుండగానే భర్త చెంప చెళ్లుమనిపించింది. విమాన ప్రయాణికుల్లో ఓ వ్యక్తిఈ తతంగాన్ని ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.