World records: వామ్మో… ఒంటివేలుతో అంత బరువు మోశాడా..! ఎలా సాధ్యమైందంటే..

ఏ వెయిట్‌ లిఫ్టర్ అయినా 129.5 కిలోల బరువును ఎత్తే ప్రయత్నంలో గర్వపడతాడు. అయితే కేవలం ఒక వేలితో ఆ స్థాయిలో బరువును ఎత్తడం ఊహించుకోండి. ఇది ఖచ్చితంగా అసాధ్యం అనిపించవచ్చు. కానీ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన స్టీవ్ కీలర్ ఆ ఖచ్చితమైన ఫీట్‌ను సాధించాడు.

Viral News

World records: ఏ వెయిట్‌ లిఫ్టర్ అయినా 129.5 కిలోల బరువును ఎత్తే ప్రయత్నంలో గర్వపడతాడు. అయితే కేవలం ఒక వేలితో ఆ స్థాయిలో బరువును ఎత్తడం ఊహించుకోండి. ఇది ఖచ్చితంగా అసాధ్యం అనిపించవచ్చు. కానీ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన స్టీవ్ కీలర్ ఆ ఖచ్చితమైన ఫీట్‌ను సాధించాడు. ప్రొఫెషనల్ మార్షల్ఆర్ట్ లో నైపుణ్యం కలిగిన స్టీవ్.. సింగిల్ వేలితో భారీ బరువును ఎత్తి పది సంవత్సరాలపాటు ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

GUJARAT: తొలిసారి సింహం రెండు కళ్లకు సర్జరీ చేసిన వైద్యులు.. ఇప్పుడెలా ఉందంటే..

2022 ఫిబ్రవరి నెలలో కెంట్‌లోని యాష్‌ఫోర్డ్‌లో స్టీవ్ కిలర్ ఈ ఫీట్‌ను ప్రయత్నించాడు. తన కుడి చేతి మధ్య వేలితో 129.5 కిలోల బరువును ఎత్తగలిగాడు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఆమోదించింది. దాని గురించి వారి అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. కీలర్ మోసంన 129.5 కిలోల బరువులో ఆరు ఐరన్ డిస్క్‌లు ఉన్నాయి. ఒకటి 10 కిలోల బరువు, ఒకటి 20 కిలోల బరువు, మూడు ఒక్కొక్కటి 25 కిలోల బరువు, ఒకటి 26 కిలోల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. కీలర్‌ ధాటికి 2012లో అర్మేనియాకు చెందిన బెనిక్‌ అనే యువకుడు ఒంటి వేలితో పైకెత్తిన 121.69 కిలోల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

Viral Video: పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఏనుగు.. వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా.. ప్రీతి జింటా ఏమందంటే..

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌ సిబ్బందితో కిలర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంత భారీ స్థాయిలో బరువు మోయడం అంటే అంతఈజీ కాదని, బరువు మోసే సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని తెలిపాడు. కానీ నా వేళ్లు బలంగా ఉండటం వల్ల తాను 129.5 కిలోల బరువును ఎత్తగలిగానని తెలిపాడు. నా సాధించిన ఘనత గురించి నేను గర్వపడుతున్నానని కిల్ అన్నాడు. కీలర్ వయస్సు 48 సంవత్సరాలు. గత నాలుగు సంవత్సరాలుగా బలాన్ని పెంచుకొనేందుకు శిక్షణను తీసుకుంటున్నాడు. కీలర్ 18 సంవత్సరాల వయస్సు నుండి జూడో, కరాటే రెండింటిలోనూ శిక్షణ పొందిఉన్నాడు. ప్రపంచ రికార్డును సాధించడానికి ప్రయత్నించినప్పుడు అది అతనికి చాలా ఉపయోగపడింది. కిలర్ తన రికార్డును ఇటీవల మరణించిన, తనకు బలాన్ని పెంచుకోవడంలో శిక్షణ ఇచ్చిన పినతండ్రికి అంకితమిచ్చాడు.