GUJARAT: తొలిసారి సింహం రెండు కళ్లకు సర్జరీ చేసిన వైద్యులు.. ఇప్పుడెలా ఉందంటే..
గుజరాత్‌లో ఐదేళ్ల సింహం రెండు కళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కంటిశుక్లం సర్జరీ చేసిన తర్వాత ఆ సింహం తిరిగి కోలుకుంటుంది. గిర్‌లోని జామ్‌వాలా రేంజ్‌లో ఐదేళ్ల మగ సింహం చాలా సేపు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండటాన్ని అటవీ సిబ్బంది గుర్తించారు. అనుమానం వచ్చి అది వేటాడేందుకు అతి సమీపంలోకి ఓ మాంసాహారాన్ని ఉంచారు. అయిన సింహం స్పందించకపోవటాన్ని గుర్తించారు.

Lion
GUJARAT: గుజరాత్‌లో ఐదేళ్ల సింహం రెండు కళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కంటిశుక్లం సర్జరీ చేసిన తర్వాత ఆ సింహం తిరిగి కోలుకుంటుంది. గిర్‌లోని జామ్‌వాలా రేంజ్‌లో ఐదేళ్ల మగ సింహం చాలా సేపు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండటాన్ని అటవీ సిబ్బంది గుర్తించారు. అనుమానం వచ్చి అది వేటాడేందుకు అతి సమీపంలోకి ఓ మాంసాహారాన్ని ఉంచారు. అయిన సింహం స్పందించకపోవటాన్ని గుర్తించారు. పెద్ద పులులకు వేటాడే సమయంలో కంటి చూపు రక్షణ ఆయుధం. కానీ కంటిశుక్లం సింహం చూపును తగ్గించింది. దీనిని నయం చేసేందుకు సింహాం మళ్లీ వేటాడేందుకు పశువైద్యులు గుజరాత్‌లో తొలిసారిగా శస్త్రచికిత్స చేశారు.
కంటిశుక్లం శస్త్రచికిత్సలో కంటి సహజ లెన్స్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేసిన దానితో భర్తీ చేయడం జరుగుతుంది. అవి మామూలుగా కుక్కల వంటి చిన్న జంతువులపై ప్రదర్శించబడతాయి. అయితే వైద్యులు సింహానికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. గతంలో పరిశోధనలను క్షుణ్ణంగా చదివి నిపుణులతో మాట్లాడారు. సింహం శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవటానికి చనిపోయిన సింహం పోస్ట్ మార్టం నుంచి పొందిన కంటి నమూనాలనుకూడా వైద్యులు అధ్యయనం చేశారు. అనంతరం సింహం రెండు కళ్లకు శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావటంతో సింహం కోలుకుంటుంది. త్వరలోనే సింహంకు పూర్తిగా కంటిచూపు వస్తుందని, తిరిగి అడవిలో వదిలేస్తామని గిర్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు.