Tractor Powered Cow Dung : ఆవు పేడతో నడిచే ట్రాక్టర్.. ప్రపంచంలో తొలిసారి

ప్రపంచంలో తొలిసారి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లు రాబోతున్నాయి. ఇకనుంచి డీజిల్ తోనే కాకుండా ఆవు పేడతో కూడా ట్రాక్టర్లు నడవనున్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశారు.

Tractor Powered Cow Dung : సాధారణంగా వాహనాలు డీజిల్, పెట్రోల్ తో నడుస్తాయి. ప్రపంచంలో తొలిసారి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లు రాబోతున్నాయి. ఇకనుంచి డీజిల్ తోనే కాకుండా ఆవు పేడతో కూడా ట్రాక్టర్లు నడవనున్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ గా మార్చారు.

ట్రాక్టర్ కు ఒక క్రయోజెనిక్ ట్యాంక్ అమర్చి, ద్రవ రూపంలోని ఈ ఇంధనాన్ని మండించారు. ఆ ఇంధనంతో 270 బీహెచ్ పీ సామర్థ్యం గల ట్రాక్టర్ ను విజయవంతంగా నడిపినట్లు వెల్లడించారు. డీజిల్ తో నడిచే ట్రాక్టర్లతో సమానంగా ఇది పని చేసిందని చెప్పారు.

Charging With Sweat : చెమటతో సెల్ ఫోన్ ఛార్జింగ్.. సరికొత్త పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

అంతేకాకుండా ఈ ట్రాక్టర్ తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసిందని తెలిపారు. క్రయోజెనిక్ ఇంజిన్ దాదాపు 160 డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసి బయో మీథేన్ ను ద్రవ రూపంలో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. కార్నిష్ కంపెనీ బెన్నామన్ ఈ ట్రాక్టర్ ను తయారు చేసింది.

ట్రెండింగ్ వార్తలు