అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ చేరుకున్నారు. సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కోసం గుజరాతీ వంటలను రుచి చూపించారు. ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఓ వంటగదిని కూడా ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లో టాప్ హోటల్స్‌లో ఫార్చూన్ హోటల్ చీఫ్ చెఫ్ సురేశ్ ఖన్నా సారథ్యంలో ఈ వంటకాలను రూపొందించారు. ఇప్పటికే ట్రంప్ కోసం రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేశారు. బ్రకోలి కార్న్‌తో చేసిన సమోసా, ఐస్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, కొబ్బరి నీళ్లు, మల్టీ గ్రెయిన్‌తో తయారు చేసిన బిస్కెట్లను ట్రంప్ దంపతులకు స్నాక్స్‌గా అందించారు.
అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఖమాన్, మల్టీగ్రెయిన్ రోటీస్, బ్రకోలి కార్న్‌తో చేసిన సమోసా వంటి రుచికరమైన గుజరాతీ వంటకాలను ట్రంప్ దంపతులు రుచిని ఆశ్వాదించారు. గుజరాత్‌లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని రకాల వంటకాలు, నాలుగైదు రుచుల టీని కూడా ఆయన మెనూలో చేర్చారు.