విమానం ఫుడ్‌లో విరిగిన పన్ను : సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ నిర్వాకం 

  • Publish Date - March 3, 2019 / 05:10 AM IST

సింగపూర్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటున్నాయి. విమానాల్లో సౌకర్యాలు. రైళ్లల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో..ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో విమానాల్లో పెట్టే ఫుడ్ కూడా అంతకంటే గొప్పగా ఉండటంలేదనీ ప్రయాణీకుల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సందర్భాలలో అయితే విమానాల్లో పెట్టే ఫుడ్ తినాలంటేనే భయపడేలా ఉంటున్నాయి. 
 

నిర్వాహకులు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల తినే ఆహారంలో ఎలుకలు, బొద్దికలే కాకుండా రకరకాల వస్తువులు బయటపడటం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. తాజాగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో కూడా ఇదే చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో సగం విరిగిన పన్ను కనిపించింది. 
 

దీంతో షాకైన ప్రయాణికుడు ఉన్నతాధికారులకు  కంప్లైంట్ చేశాడు. అంతేకాదు దాన్ని సోషల్ మీడియాలో ఫొటో పెట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.అదికాస్తా వైరల్ గా మారింది.  ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్లే బుట్టన్ అనే ప్రయాణికుడు ఆహారం తింటుండగా పంటికి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని చూస్తే.. విరిగిన పన్ను కనిపించింది. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్‌లైన్స్ బుట్టన్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.