×
Ad

Mahatma Gandhi Statue Stolen: ఎంతకు తెగించార్రా.. ఏకంగా 420 కిలోల మహాత్మా గాంధీ విగ్రహం చోరీ..

2021లో భారత ప్రభుత్వం గాంధీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది. అప్పటి ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • Published On : February 3, 2026 / 06:29 PM IST

Mahatma Gandhi Statue Representative Image (Image Credit To Original Source)

  • జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం చోరీ
  • 420 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహం
  • 2021లో బహుమతిగా ఇచ్చిన భారత్

Mahatma Gandhi Statue Stolen: దొంగలు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మన దగ్గరే కాదు విదేశాల్లోనూ దొంగలు బరి తెగిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో షాకింగ్ ఘటన జరిగింది. ఏకంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్నే ఎత్తుకెళ్లారు. మెల్ బోర్న్ లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఉన్న ఈ విగ్రహాన్ని దుండగులు కట్ చేసి మరీ ఎత్తుకెళ్లారు. ఈ విగ్రహం ఏకంగా 420 కిలోల బరువు ఉంటుంది. చోరీ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2021లో భారత ప్రభుత్వం గాంధీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది. అప్పటి ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గాంధీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిన భారత్..

మెల్‌బోర్న్‌లోని రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఈ మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ఈ విగ్రహాన్ని బహుమతి ఇచ్చింది. ఈ స్టాచ్యూ ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజ సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతకు ప్రతీక.

సోమవారం తెల్లవారుజామున విగ్రహం చోరీ జరిగిందని తెలుస్తోంది. ముగ్గురు దుండుగలు యాంగిల్ గ్రైండర్ ఉపయోగించి 420 కిలోల బరువున్న విగ్రహాన్ని దాని పునాది నుండి కట్ చేశారని పోలీసులు తెలిపారు.

విక్టోరియా పోలీస్ నాక్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్క్రాప్ మెటల్ డీలర్లను అలర్ట్ చేశారు. ఎవరైనా కాంస్య విగ్రహాన్ని విక్రయించడానికి మీ వద్దకు వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.

ఒక జాతీయ నాయకుడి విగ్రహం కనిపించకుండా పోవడం మాకు బాధగా ఉంది. బాలాక్లావాస్‌తో కప్పబడిన వ్యక్తులతో తెల్లటి వ్యాన్ వచ్చింది. వివరాలను పోలీసులకు అందజేశాము” అని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ ఛారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రకారం తెలిపారు. ఈ విగ్రహాన్ని నవంబర్ 12, 2021న ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు. కాగా, ఆవిష్కరణ జరిగిన 24 గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న భారత వ్యతిరేక భావన..

ఆస్ట్రేలియాలో భారత వ్యతిరేక భావన పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధ్వంసం జరగడం కలకలం రేపింది. గతంలో భారత దౌత్య కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలు వంటి సమాజ స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఖలిస్తాన్ సంబంధిత ఉగ్రవాదులతో దీనికి సంబంధం ఉందని అనుమానం. జూలై 2025లో, మెల్‌బోర్న్ తూర్పు శివారు ప్రాంతమైన బోరోనియాలోని శ్రీ స్వామినారాయణ్ ఆలయంపై జాత్యహంకార రాతలు రాశారు. అంతేకాదు ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా వారు నడిపే రెస్టారెంట్లపై కూడా ఇదే విధమైన దూషణలు పెయింట్ చేశారు.

Also Read: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్‌.. ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏఏ రంగాలకు ప్రయోజనం