Train tracks: వామ్మో.. ఈ ఎద్దు ట్రైన్ ట్రాకులపై ఎలా పరుగులు తీసిందో చూడండి..

ఆ ఎద్దును అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత తిరిగి ట్రైన్ల రాకపోకలు కొనసాగాయి. ఎద్దు వల్ల..

bull

New Jersey: ట్రైన్ ట్రాకులపై పరుగులు తీసింది ఓ ఎద్దు. దీంతో అక్కడి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలు ఆలస్యంగా స్టేషన్‌లోకి రావాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని న్యూ జెర్సీలో చోటుచేసుకుంది.

కబేళా నుంచి ఆ ఎద్దు తప్పించుకుని వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రైన్ ట్రాకులపై ఎద్దు పరుగులు తీస్తుందన్న సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎద్దును తీసుకెళ్లేందుకు వ్యానును తీసుకొచ్చారు. ఎద్దుకు మత్తుమందు ఇచ్చి దాన్ని ట్రైన్ ట్రాకు నుంచి బయటకు లాగి వ్యానులో తీసుకెళ్లారు.

దాన్ని జంతు సంరక్షణశాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఆ ఎద్దును అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత తిరిగి ట్రైన్ల రాకపోకలు కొనసాగాయి. ఎద్దు వల్ల ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ట్రైన్ ట్రాకులపై ఎద్దు పరుగులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Screen Addiction : సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలా? జస్ట్ బ్లాక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి చాలు..