Screen Addiction : సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలా? జస్ట్ బ్లాక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి చాలు..
సెల్ ఫోన్ అవసరంగా కాకుండా వ్యసనంగా మారిపోతోంది. ఇది సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యసనం నుండి బయటపడటానికి సెల్ ఫోన్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి.

Screen Addiction
Screen Addiction : సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితికి కనిపిస్తోంది. అతిగా సెల్ ఫోన్ వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్ నుండి బయటపడటానికి మన అలవాట్లతో పాటు సెల్ ఫోన్ సెట్టింగ్స్ కూడా మార్చాలి.
Phone to the washroom : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ఉదయాన్నే నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. ఇంపార్టెంట్ మెసేజ్ లు చెక్ చేస్తాం. ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ పైకి మనసు మళ్లుతుంది. అసలు రాత్రంతా ఎక్కడ ఏం జరిగాయో తెలుసుకోవాలన్న ఆత్రంతో వాటిని ఓపెన్ చేస్తారు. అంతే ఇక టైమ్ అంతా వాటిని చెక్ చేయడంతో సరిపోతుంది. నిత్యం ఇదో వ్యసనంగా మారిపోతుంది. దీని నుండి బయటపడటం కష్టమవుతుంది.
ఇటీవల Vivo ఇచ్చిన సర్వే ప్రకారం 90% మంది ప్రజలు సెల్ ఫోన్ తమ జీవితంలో భాగంగా భావిస్తున్నారట. 83% మంది పిల్లలు కూడా ఇలాగే భావిస్తున్నారట. ఇక 91% మంది సెల్ ఫోన్ పాడైతే ఆందోళన చెందుతున్నారట. 89% మంది పిల్లలు తమను తాము ఆన్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్ లతో పోల్చుకుంటున్నారట. అయితే సెల్ ఫోన్ వ్యసనం నుండి నుండి బయటపడటం మన చేతుల్లోనే ఉంటుంది.
Phone in Petrol Bunks : మీ సెల్ ఫోన్లో రేడియేషన్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి
సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలంటే ముందుగా అసలు ఫోన్ తో మీరు ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. సెల్ ఫోన్ తో గడిపిన ప్రతి 20 నిముషాలు మీ ప్రియమైన వారితో గడపలేదు.. ఇష్టమైన అంశాలపై దృష్టి పెట్టలేదు.. కాబట్టి ఎంత సమయం వృధా అయ్యిందనే అంశాన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ మాట్లాడిన ప్రతిసారి ఎంత సమయం కాల్ మాట్లాడుతున్నారో కూడా లెక్కించుకోవాలి. ఈ లెక్కతో ఏడాది మొత్తంలో ఎంత సమయాన్ని ఫోన్ మాట్లాడటం కోసం వినియోగిస్తున్నామో కూడా లెక్కలు వేసుకోవాలి.
ఫోన్ ఛార్జింగ్ పాయింట్ బెడ్‌కి దగ్గరలో ఉంచుకోకండి. ఎక్కువగా ఫోన్ మాట్లాడటం ఇష్టం లేదన్న విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్య చెబుతూ ఉండాలి. అలాగే భోజన సమయాల్లో కూడా సెల్ ఫోన్ దగ్గర ఉంచుకోవడం మానేయాలి. మరీ ముఖ్యంగా మీ ఫోన్ వాల్ పేపర్ కూడా మిమ్మల్ని ఫోనువైపు అట్రాక్ట్ చేస్తుంది. ఆకర్షిస్తుంది. అందుకోసం ముందు మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చాలి. నలుపు, లేదా తెలుపు వాల్ పేపర్లు పెట్టుకోవడం వల్ల ఫోన్ అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ రంగులు తక్కువ ఆకర్షణీయంగానూ, తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తాయి. హోమ్ స్క్రీన్‌పై ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను ఉంచకండి. ఫోన్ అన్ లాక్ చేయగానే ఈ యాప్‌లు కనిపిస్తే తెలియకుండానే వాటిని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తారు.
పిల్లలకు చదువుకునే సమయం అత్యంత కీలకం. వారికి సెల్ ఫోన్ వినియోగం గురించి అర్ధం చేసుకునేలా చెప్పాలి. సోషల్ మీడియా దుష్ప్రభవాలను కూడా వివరించాలి. ఈ ప్లాట్ ఫారమ్‌ల మీద మనం గడిపే సమయం ఇతరులకు ఆదాయంగా మారి మనకు ఒత్తిడి పెరుగుతోందనే విషయాన్ని ఎక్స్‌ప్లైన్ చేయాలి. సాంకేతికతను పూర్తిగా విస్మరించేలా కాకుండా అవసరమైన మేరకు దాని వినియోగం ఉండాలనేది వారికి అవగాహన కల్పించాలి. ఇలాంటి కొన్ని మార్పులు, చేర్పులతో సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడొచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, కంటి ఆరోగ్యం బాగుండాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి.