Phone in Petrol Bunks : మీ సెల్ ఫోన్లో రేడియేషన్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి

పెట్రోలు బంకులో పేలిన సెల్ ఫోన్ అని అనేక ప్రమాద వార్తలు వింటూ ఉంటాం. అందుకు కారణం అధిక రేడియోషన్ ఉన్న స్మార్ట్ ఫోన్‌లో వారు ఫోన్ మాట్లాడటమే. అసలు మీ ఫోన్‌లో రేడియేషన్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారా?

Phone in Petrol Bunks : మీ సెల్ ఫోన్లో రేడియేషన్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి

Phone in Petrol Bunks

Phone in Petrol Bunks : పెట్రోలు బంకుకి వెళ్లినపుడు సెల్ ఫోన్ లో మాట్లాడొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. కొందరు ఆ మాటలు పెడ చెవిన పెట్టి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. డబ్బులు చెల్లించేటపుడు సెల్ ఫోన్ ఉపయోగిస్తాం.. కాల్ మాట్లాడితే ఏమౌతుంది? అనే వితండ వాదానికి దిగుతుంటారు. వాస్తవం తెలుసుకుంటే కాల్ మాట్లాడటానికి భయపడతారు.

Brazil : సెల్ ఫోన్‌తో పాటు ఆమె మనసు దోచుకున్న దొంగ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రేమ కథ

పెట్రోలు బంకులలో సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. తీవ్ర గాయాల పాలైన వారు ఉన్నారు. అసలు పెట్రోల్ బంకులో ఫోన్ ఎందుకు మాట్లాడవద్దు అంటారో కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి స్మార్ట్ ఫోన్ నుంచి రేడియేషన్ వస్తుంది. మీ మొబైల్‌లో ఈ రేడియేషన్ SAR (స్పెసిఫిక్ అబ్సప్షన్ లెవెల్) లెవెల్ 1.6 కంటే తక్కువ ఉంటే ప్రమాదకరం కాదని అర్ధం. అదే 3.5 కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అంతటి రేడియేషన్ ఉన్న మొబైల్ ఫోన్ పెట్రోల్ బంకులో వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ఇక మీ మొబైల్‌లో రేడియేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే  *#07#  కోడ్  టైప్ చేసి చెక్ చేసుకోండి.

Pregnant Women : గర్భిణీలు సెల్ ఫోన్ మాట్లాడితే…రేడియేషన్ ప్రభావం బిడ్డపై…

ఇక పెట్రోలు బంకులో పేమెంట్స్ మాత్రం సెల్ ఫోన్ ద్వారానే చేస్తాం. మరి వాటికి ఎలా అంగీకరిస్తారు? అనే డౌట్ రావచ్చు. కాల్ మాట్లాడేటపుడు ఉండే రేడియేషన్ కంటే పేమెంట్ చేసేటపుడు రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అది పెద్ద ప్రమాదం కలిగించదు కాబట్టి ఫోన్ పేమెంట్‌కి అనుమతి ఇస్తారు. కాబట్టి పెట్రోలు బంకుకి ఫోన్ తీసుకువెళ్లినపుడు ఈ విషయాల పట్ల అవగాహనం ఉండటం అవసరం.