Pregnant Women : గర్భిణీలు సెల్ ఫోన్ మాట్లాడితే…రేడియేషన్ ప్రభావం బిడ్డపై…

తక్కువ రేడియేషన్‌కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి.

Pregnant Women : గర్భిణీలు సెల్ ఫోన్ మాట్లాడితే…రేడియేషన్ ప్రభావం బిడ్డపై…

Pregnancy

Pregnant Women : గర్భం దాల్చింది మొదలు గర్భిణీలు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. తీసుకునే ఆహారం మొదలు, రోజువారి దైనందిన కార్యక్రమాల వరకు అన్నింటిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్న నేపధ్యంలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. గర్భంతో ఉన్నవారు సైతం సెల్ ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడటం అలవాటై పోయింది. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికత ఒక వరంలా మారినప్పటికీ సెల్ ఫోన్‌లు, వైర్‌లెస్ పరికరాలు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి.

గర్భంతో ఉన్న సమయంలో బంధుమిత్రులు యోగక్షేమ సమాచారం కోసం ఫోన్లు చేస్తుంటారు. దీంతో ఎక్కవ సేపు సెల్ ఫోన్లలో మాట్లాడాల్సి వస్తుంది. ఇలా చేయటం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ అధికంగా మాట్లాడే గర్భిణీల్లో పుట్టబోయే బిడ్డపై రేడియేషన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన వెంటనే ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ పెరుగుతున్న కొద్ది రేడియేషన్ ప్రభావం కారణంగా సమస్యలు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు వైర్‌లెస్ రూటర్ల నుండి వచ్చే రేడియేషన్ పెరుగుతున్న పిండంపై ప్రభావం చూపుతుంది. గర్భిణీలు ఈ దశలో రేడియేషన్‌కు దూరంగా ఉండటం మేలు.

తక్కువ రేడియేషన్‌కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఏమాత్రం రేడియేషన్‌ ప్రభావానికి లోనుకాకూడదు. పిండం మెదడు అభివృద్ధికి హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో సైతం దీనిని నిర్ధారించారు. అంతేకాకుండా బిడ్డ పుట్టిన తరువాత చాలా మంది చిన్నారులకు సమీపంలో సెల్ ఫోన్ లు ఉంచటం, వారి చేత వచ్చీరాని మాటలను ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేయటం వల్ల సైతం పసిపిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన మార్పులకు దారితీస్తున్నట్లు వారు గుర్తించారు. గర్భిణులు రోజులో అవసరానికి రెండు మూడు సార్లు మినహా, ఎక్కవగా మొబైల్ ను వినియోగించటం అంత శ్రేయస్కరం కాదని వారు సూచిస్తున్నారు. ఒక్కోకాల్ ను నాలుగు నిమిషాలకు మించకుండా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ సమయం మాట్లాడితే మాత్రం బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.

అంతే కాకుండా గర్భీణీలు సెల్ ఫోన్ అదే పనిగా మాట్లాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం వల్ల రాత్రి సమయంలో రాత్రి సమయంలో నిద్రపట్టని పరిస్ధితి నెలకొంటుంది. మరికొందరు ఫోన్ లు మాట్లాడకపోయినా రాత్రి పొద్ద పోయే వరకు వాటితో గడపటం వల్ల కూడా నిద్రలేమి, తలనొప్పి, కంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎముకల సాంద్రత , మెదడు కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో అధిక రేడియేషన్‌కు గురికావడం వల్ల గర్భిణీ స్త్రీల మెదడు కార్యకలాపాలు మారే అవకాశాలు ఉంటాయి. వారిలో అలసట, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి కలిగిస్తుంది. ఫోన్‌ను వీలైనంత వరకు గర్భిణీలు తమ శరీరానికి దూరంగా పెట్టుకోవటం మంచిది. బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ హెడ్‌సెట్లకు బదులుగా వైర్‌తో ఉన్న హెడ్‌సెట్లను వాడితే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పు నుండి బయటపడవచ్చు. రాత్రి పూట నిద్రించేటప్పుడు ఫోన్‌ను తల పక్కనే పెట్టుకుని నిద్రించటం చేయరాదు.