Pakistan Bus Accident: బ్రేకులు ఫెయిల్.. కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావటంతో ఎదురు వస్తున్న కారును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు.

Pakistan Bus Accident: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాక్‌లోని కల్కర్‌హర్ సాల్ట్ రేంజ్ ప్రాంతంలో బస్సు కాల్వలోకి దూసుకెళ్లడంతో 12మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో 50 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వైపు వెళ్తుంది. బస్సు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ కావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి

బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయిన సమయంలో బస్సు వేగంగా వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి పక్కనేఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక బృందాల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

 

పాకిస్థాన్ లో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 7న పాకిస్థాన్‌లోని కోహిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈప్రమాదంలో కారును ఢీకొట్టిన బస్సు రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. ఈప్రమాదంలో 22 మంది మరణించారు. తాజాగా అలాంటి తరహా ప్రమాదం చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు