Mask
Masks California : ఓ వైపు..కరోనా..మరోవైపు..ఒమిక్రాన్..ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. పలు దేశాలు మరోసారి కఠిన ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నాయి. డెల్టా రకం కంటే అత్యంత వేగంగా…ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే..నిబంధనలు పాటించాలని సూచిస్తున్నా…కొంతమంది నిర్లక్ష్యం చేస్తుండడంతో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో కాలిఫోర్నియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ కంపల్సరీ అంటూ ఆర్డర్స్ జారీ చేసింది. ఇండోర్ లలో ఉన్న ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తాజాగా సూచించింది.
Read More : Manohari Gold Tea : రికార్డ్ ధరకు అసోం మనోహరి టీ పొడి.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం సెలవుల్లో తమ కుటుంబాలు, స్నేహితులు కలుసుకోవడానికి వెళుతున్న వారికి మాస్క్ తప్పనిసరి అంటూ కాలిఫోర్నియా అధికార యంత్రాంగం సూచించింది. ఈ సరికొత్త నిబంధన 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్ గావిన్ న్యూసమ్ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే…కాలిఫోర్నియాలో ఏకంగా కోవిడ్ కేసులు 47 శాతం పెరిగాయి.
Read More : Manohari Gold Tea : రికార్డ్ ధరకు అసోం మనోహరి టీ పొడి.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే వెల్లడించారు. ప్రతొక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్క్ అవసరం లేదని జూన్ 15వ తేదీన ప్రకటించింది. కానీ..కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న క్రమంలో కౌంటీ ప్రభుత్వాలు స్థానికంగా నిబంధనలు అమలు పరుస్తున్నాయి.