Plane Crash: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం.. భవనం పైకప్పును ఢీకొట్టిన ఘటనలో పలువురు మృతి

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కుప్పకూలింది. అక్కడి కాలమానం ప్రకారం గురువారం (జనవరి 2) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

California Plane Crash

California Plane Crash: ప్రపంచ వ్యాప్తంగా తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజుల క్రితం దక్షిణ కొరియాలోని మువాన్ ఎయిర్ పోర్టులో రన్ వేపై ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది బెజు ఎయిర్ ప్లైట్ 2216 విమానం మువాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి విమానం దగ్దమైంది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘనటలో ఇద్దరు వినహా మిగిలిన 179 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాద ఘటన మరవకముందే తాజాగా.. కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read: Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కుప్పకూలింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. గురువారం (జనవరి 2) మధ్యాహ్నం దక్షిణ కాలిఫోర్నియాలోని వాణిజ్య భవనంపై సింగిల్ ఇంజిన్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. 18మందికి గాయాలయ్యాయి. అయితే, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డిస్నీల్యాండ్ కు ఆరు మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Plane Crash: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి కారణం ఏమిటి.. ఎంతమంది మరణించారంటే?

టేకాఫ్ అయిన ఒక నిమిషం తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విమానాన్ని సింగిల్ ఇంజిన్ వ్యాన్ యొక్క RV-10గా గుర్తించింది. నాలుగు సీట్లు, ఒకే ఇంజిన్ ఉంటుంది. ఈ విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విమాన శకలాలు పైకప్పుపై దగ్దమౌవుతున్నట్లు కనిపించింది. ఘనట జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 

విమానం ఢీకొట్టిన భవనంలో కుట్టుమిషన్లు, టెక్స్ టైల్ స్టాక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం అనంతరం సమీపంలోని దుకాణాలను అధికారులు మూసివేయించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 18మంది గాయపడ్డారని, వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఫుల్లెర్టన్ పోలీసు ప్రతినిధి క్రిస్టీ వెల్స్ మీడియాకు వెల్లడించారు.