Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?

విమానాలకు పక్షులు తగులుతుండడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?

Updated On : December 29, 2024 / 7:28 PM IST

దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఘోర విమాన ప్రమాదం జరిగి 179 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 7సీ2216 విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే చోటుచేసుకున్న ఇటువంటి ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఈ విమాన ప్రమాదం సహా కొన్ని నెలల వ్యవధిలో జరిగిన ప్రమాదాల గురించి చూద్దాం..

1. దక్షిణ కొరియా 
బోయింగ్ 737-800 విమానం జెజు ఎయిర్ ఫ్లైట్ 2216 ఈ నెల 29న దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఆ విమానం అదుపు తప్పి విమానాశ్రయంలోని రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. మొత్తం 179 మంది మృతిచెందారు.

2. కజకిస్థాన్‌ అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం
కజకిస్థాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూడా ఈ నెలలోనే ఘోర ప్రమాదానికి గురైంది. ఈ నెల 25న ఫ్లైట్ J2-8243 బాకు నుంచి చెచెన్ రాజధాని గ్రోజ్నీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 38 మంది చనిపోయారు. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. ఆ విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదానికి గురైంది.

3. పాపువా న్యూ గినియా
ఈ ఏడాది డిసెంబర్ 22న నార్త్ కోస్ట్ ఏవియేషన్ విమానం బ్రిటన్-నార్మన్ బీఎన్‌-2బీ-26 ఐస్‌ల్యాండర్‌.. పాపువా న్యూ గినియాలోని నాడ్‌జాబ్‌కు ఈశాన్యంగా దాదాపు 32 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సప్మంగా లోయలో కుప్పకూలింది. చెట్లతో కూడిన భూభాగాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

4. యూకే
కాల్‌సైన్ ఈఏజీ71పీ ఎమరాల్డ్ ఎయిర్‌లైన్స్ యూకే ఏటీఆర్‌ 72-600 బెల్‌ఫాస్ట్ విమానాశ్రయంలో రన్‌వే 04లో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. విమానం ముందు భాగంలో నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు.

5. సూడాన్
ఈ ఏడాది అక్టోబర్ 25న వ్యవసాయ స్ప్రేయింగ్ ఫ్లైట్ స్థానిక ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు తుక్-తుక్ ప్రాంత నివాసితులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. విమానం కుడి వింగ్‌తో పాటు ప్రొపెల్లర్‌ ధ్వంసమైంది.

6. మాలావా
మలావీ వైమానిక దళానికి చెందిన డోర్నియర్ 228-202కే కూడా కుప్పకూలింది. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఆ విమానం పర్వతం వైపునకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో ఉన్న మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఆ విమానం మొదట చెట్టు ట్రంక్‌ను ఢీకొట్టింది. విమానం ఫ్యూజ్‌లేజ్ భూమిని తాకింది.

పక్షులు తగులుతుండడంతో ప్రమాదాలు
విమానాలకు పక్షులు తగులుతుండడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) తెలిపిన వివరాల ప్రకారం.. ఇటువంటి ఘటనల్లో సుమారు 90 శాతం విమానాశ్రయాల దగ్గర, విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో, భూమికి తక్కువ ఎత్తులో పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల జరుగుతున్నాయి.

పక్షులు తాకితే ముఖ్యంగా చిన్న విమానాలకు, ప్రత్యేకించి సింగిల్ ఇంజిన్ విమానాలకు ఎంతో ప్రమాదకరం. 1988 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు 262 చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల 250 విమానాలు ధ్వంసమయ్యాయి.

Income Tax Calendar 2025 : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్.. వచ్చే జనవరికి సంబంధించి కీలక గడువు తేదీలివే..!