Monkeypox
Monkeypox: మంకీపాక్స్ సోకిన తొలి వ్యక్తి హాస్పిటల్ నుంచి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌లోని ఫకేట్ లో తొలి కేసు నమోదుకాగా కంబోడియా అధికారులు హెల్త్ ప్రొటోకాల్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో మంకీపాక్స్‌ను అడ్డుకునేందుకు గానూ అతనితో కాంటాక్ట్ అయినవాళ్ల ఆచూకీ తెలుసుకునే పనిలోపడ్డారు.
నైజీరియా దేశస్థుడైన ఓ వ్యక్తి సంవత్సరం నుంచి థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. ఫకేట్ అనే ఐలాండ్‌లో బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాడు. అవి మంకీపాక్స్ కేసు పాజిటివ్ అని తెలియగానే బయటి వ్యక్తుల సాయంతో పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపుచేపట్టారు.
అతణ్ని మరో ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా చెప్పేందుకు ఫోన్ చేయగా అప్పటికే ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అతనితో కాంటాక్ట్ అయిన మరో ఇద్దరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిన ఫకేట్ అనే వ్యక్తిని ఎక్కించుకున్న ట్యాక్సీ డ్రైవర్ శాంపుల్స్ కూడా సేకరించామని డిప్యూటీ గవర్నర్ తెలిపారు.
Read Also : మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్..కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలి
మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్‌ఈఐసీ)’గా పేర్కొంది.