ఒంటె, ఆవు, గాడిద ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందిన విభిన్నమైనవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు గాడిదల గుంపుతో అస్సలు కలవవు. కానీ అమెరికాలోని కన్సాస్‌లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలసి తిరుగుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. క్రిస్టమస్ పండుగ సీజన్లో ఇలా ఈ మూడు జంతువులు కలిసి మెలిసి తిరగటం విశేషంగా మారింది.
ఈ ఒంటె, ఆవు,గాడిదలు కాన్సాస్ జూలోని టాంగన్యికా వైల్డ్ లైఫ్ పార్కుకు చెందినవని పోలీస్ అధికారులు మొదటి భావించారు. కానీ అది కాదనీ వీటి యజమానులు ఎవరో ఏమిటో తెలపాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఈ మూడు జంతువులకు సంబంధించిన యజమాని ఒక్కరేనా..లేదా వేరు వేరుగా ఉన్నారా అనే విషయం తెలియాల్సిఉంది. ఏదీ ఏమైన భిన్న జాతికి చెందిన ఈ మూడు జంతువులు కలిసి మెలిసి తిరగటం కన్సాస్ లోనే కాక సోషల్ మీడియాలో కూడా విశేషంగా మారింది.
ఈ ఫొటోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేయడంతోపాటు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను ఇటీవల గోడార్డ్ పోలీసులు తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే వీటి యజమాని ఎవరో సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా ఈ ఫొటోను నవంబర్ 19నాటికి వెయ్యి మందికి పైగా షేర్ చేశారు. ఇప్పటికే ఈ ఫోటో షేరింగ్ లు పెరుగుతున్నాయి.