Khalistani Terrorist Pannun: హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‫‭లకు ఖలిస్తానీ తీవ్రవాది బెదిరింపులు.. రూ.కోటి నజరానా ప్రకటన

కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్‭బీఐ ఏజెంట్ కావచ్చని కూడా అంటున్నారు

Amit shah and Jaishankar: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‫‭, కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మలకు కెనడాకు చెందిన నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ కి చెందిన జీఎస్ పన్నూన్ అనే ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు చేశాడు. వారు విదేశాలకు వెళ్లిన సమాచారం ఇస్తే కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని అతడు ప్రకటించాడు.

Yasin Malik at Supreme Court: అనుమతి లేకుండా సుప్రీంకోర్టుకు వచ్చిన యాసిన్ మాలిక్.. భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

సిఖ్ రాడికల్స్ మధ్య జరిగిన అంతర్-గ్యాంగ్ వార్‌ఫేర్‌లో కాల్చివేయబడిన నిజ్జర్‌కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం పైన పేర్కొన్న వారిని జవాబుదారీగా ఉంచుతానని తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో పన్నూన్ తెలిపాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం పన్నూన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు. అతడికి అమెరికా, కెనడాల ఉమ్మడి పాస్‌పోర్ట్‌ ఉంది.

Mamata Banerjee: ఇండియా కూటమి ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి పదవిపై స్పందించిన మమతా బెనర్జీ.. ఇంతకీ ఏమన్నారో తెలుసా?

సిఖ్ ఫర్ జస్టిస్ ఆగస్టు 15న ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలోని భారతీయ దౌత్య ప్రాంగణాలను ముట్టడించాలని కెనడాలో ఉన్న సిక్కు రాడికల్‌లకు పిలుపునిచ్చింది. వాంకోవర్‌లో సిక్కు రెఫరెండం అని సెప్టెంబర్ 10న ప్రకటించింది. అమిత్ షా, జైశంకర్, వర్మల తలలపై బహుమానం గురించి కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇప్పటికే తెలియజేసింది.

Shocking Video Goes Viral : ప్రియుడితో తిరుగుతున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త…వీడియో వైరల్

కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్‭బీఐ ఏజెంట్ కావచ్చని కూడా అంటున్నారు. అందుకే అమెరికా న్యాయస్థానం అతనిపై చర్య తీసుకోదని వినిపిస్తోంది. దశాబ్దాలుగా కెనడా, బ్రిటన్, అమెరికా, జర్మనీలు పంజాబ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో సిక్కు రాడికల్‌లకు ఆశ్రయం ఇచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు