Canadian Diplomat Summoned After Allegations
Canadian Diplomat : భారత్‌తో కెనడా కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోసారి భారత్‌పై కెనడా తన అక్కసును వెళ్లగక్కింది. ఆ దేశ దౌత్యాధికారి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దేశంలోని ఖలిస్తాన్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకోవాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని కెనడా మంత్రి చేసిన ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు అసంబద్ధం, నిరాధారమైనవిగా పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా దౌత్యవేత్తను పిలిపించి భారత్ సమన్లు జారీ చేసింది.
కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ మంగళవారం ప్రజా భద్రత, జాతీయ భద్రతపై దేశ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి దౌత్యపరమైన నోట్‌ను అందజేసినట్లు తెలిపారు. డేవిడ్ మారిసన్ కమిటీ ముందు కేంద్ర హోం మంత్రిపై చేసిన నిరాధారమైన ఆరోపణలపై భారత ప్రభుత్వం నిరసిస్తున్నట్లు నోట్‌లో తెలియజేసినట్లు జైస్వాల్ తెలిపారు.
కెనడా తమ అధికారులు వాషింగ్టన్ పోస్ట్‌కు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని అంగీకరించింది. అలాంటి చర్యలు భారత్, కెనడా మధ్య సంబంధాలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వాస్తవానికి, భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇతర దేశాలను ప్రభావితం చేసే వ్యూహంలో భాగమని పేర్కొంది. కెనడియన్ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ మీడియాకు నిరాధారమైన అపోహలను లీక్ చేశారనే వెల్లడించింది.
కెనడా నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్‌మెంట్‌లో చైనా, ఉత్తర కొరియా, రష్యా, ఇరాన్‌లతో పాటు భారత్‌ను ప్రత్యర్థిగా పేర్కొన్నట్లు వచ్చిన నివేదికలపై జైస్వాల్ స్పందించారు. సాక్ష్యం లేకుండా చేసిన ఆరోపణలకు ఇది మరో ఉదాహరణగా పేర్కొన్నారు. “భారత్‌పై దాడి చేసేందుకు కెనడియన్ వ్యూహానికి ఇది మరో ఉదాహరణగా కనిపిస్తోంది.
నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, వారి సీనియర్ అధికారులు భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ అభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బహిరంగంగా అంగీకరించారు. భారత కాన్సులర్ అధికారులు కొందరు తమపై నిఘా ఉంచారని కెనడా ప్రభుత్వం తెలియజేసిందని, ఇది దౌత్యపరమైన ఒప్పందాలను కచ్చితమైన ఉల్లంఘనగా అభివర్ణించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
Read Also : US Sanctions : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సహకరించినందుకు 19 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!