US Sanctions : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సహకరించినందుకు 19 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!

US Sanctions : రష్యాతో యుద్ధానికి మద్దతుగా నిలిచాయనే అక్కసుతో భారత్ చెందిన 19 కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కంపెనీలు, వ్యక్తులపై యునైటెడ్ స్టేట్స్ భారీ ఆంక్షలను ప్రకటించింది.

US Sanctions : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సహకరించినందుకు 19 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!

19 Indian companies for aiding Russia war against Ukraine

Updated On : November 2, 2024 / 10:39 PM IST

US Sanctions : భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాతో యుద్ధానికి మద్దతుగా నిలిచాయనే అక్కసుతో భారత్ చెందిన 19 కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కంపెనీలు, వ్యక్తులపై యునైటెడ్ స్టేట్స్ భారీ ఆంక్షలను ప్రకటించింది.

చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీకి చెందిన కంపెనీలపై కూడా రష్యాకు యుద్ధంలో మద్దతు ఇచ్చినందుకు ఆయా కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ విభాగం పేర్కొంది. రష్యాకు కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ సరుకులు, మైక్రో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోంది.

రష్యా రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఆ దేశీయ రక్షణ రంగ కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలను విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో నియమించిన అనేక మంది సీనియర్ రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను, రక్షణ కంపెనీలను రష్యా భవిష్యత్తు ఇంధన ఉత్పత్తి, ఎగుమతులకు మద్దతు ఇచ్చేవారిపైనే ఆంక్షలను విధించింది. ఈ జాబితాలో ఎగుమతి కంపెనీలు, రష్యా ఇంధన ఉత్పత్తి కూడా ఉన్నాయని అమెరికా ట్రెజరీ డిప్యూటీ సెక్రటరీ వాలీ అడెయెమో తెలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా చట్టవిరుద్ధమైన, అనైతిక యుద్ధానికి పాల్పడిందని అన్నారు. మిత్రదేశాలకు అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు. రష్యాకు చైనా ద్వంద్వ వినియోగ వస్తువులను ఎగుమతి చేయడంపై యూఎస్ ట్రెజరీ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ఆధారిత సంస్థలు మాస్కోకు అవసరమైన భాగాలను సరఫరా చేశాయని, ఆయుధాలను ఉత్పత్తి చేయడంలో రక్షణ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో సాయపడిందని పేర్కొంది.

అమెరికా ఆంక్షలపై భారత్ రియాక్షన్ :
19 భారతీయ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ నివేదికల గురించి న్యూఢిల్లీకి తెలుసని అన్నారు. రష్యాతో చట్టపరంగానే వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రసాయన ఆయుధాలు, న్యూక్లియర్ తయారీని నిరోధించే కూటముల్లో భారత్ సభ్యదేశంగా ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ నిబంధనలనే భారత్ పాటిస్తుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగానే భారత్ వ్యవహరిస్తుందని జైశ్వాల్ పేర్కొన్నారు.

Read Also : Credit Cards Stocks : స్టాక్‌లలో పెట్టుబడి పెడుతున్నారా? మీ క్రెడిట్ కార్డ్‌తో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా?