Wuhan study on felines : కరోనా వైరస్ పెంపుడు జంతువుల నుంచి సోకుతోందా ? జంతువులు కూడా వైరస్ బారిన పడుతున్నాయా ? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరుపుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకుతుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ వీటికి సరైన రుజువులు దొరకలేదు. కరోనా పుట్టినిల్లుగా చూపెట్టే..చైనాలోని వుహాన్ పట్టణంలో ఇప్పుడు పెంపుడు పిల్లులపై ప్రయోగాలు జరుపుతున్నారు. కోవిడ్ పరీక్షలను జరపాలని హువాఝంగ్ వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ణయించారు. అధ్యయనంకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఎమర్జింగ్ మ్రైక్రోబ్స్ అండ్ ఇన్‌ఫెక్షన్స్’ జర్నల్‌లో ప్రచురించారు.
https://10tv.in/salmon-fish-may-carry-infectious-coronavirus-for-a-week-study-shows/
మూడు యానిమల్ షెల్టర్స్, మూడు పెట్ హాస్పిటల్స్, కరోనా సోకిన రోగుల ఇళ్ల నుంచి 141 పిల్లులను సేకరించారు. అన్ని రకాల శాంపిల్స్ తీశారు. 14.7 శాతం పిల్లుల్లో కరోనా యాంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు. 10.8 శాతం పిల్లుల్లో స్థిరమైన యాంటీ బాడీస్ దొరికాయి. కరోనా సోకిన పెంపుడు పిల్లుల్లో ఆ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం పెంపుడు జంతువుల నుంచి కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కానీ..జంతువుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందా ? లేదా ? అనే దానిపై ఇంకా పరిశోధనలు జరగాల్స ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.