Caught On Camera: ఏడో తరగతి విద్యార్థినిపై బస్సు డ్రైవర్ దాడి.. వీడియోలో రికార్డైన ఘటన.. డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం
స్కూల్‌కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
- Narender Thiru
- Published on- October 28, 2022 / 12:26 PM IST
Caught On Camera: స్కూల్ బస్సులో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు బస్సు డ్రైవర్. దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
PM Modi: రిషి సునాక్‌కు మోదీ ఫోన్.. కలిసి పనిచేద్దామని పిలుపు.. వాణిజ్య ఒప్పందంపై చర్చ
గత మంగళవారం, అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం, డెట్రాయిట్లో ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న ఒక పన్నెండేళ్ల బాలికకు, ఆమె స్కూల్ బస్సు డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో డ్రైవర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరూ బస్సులోని సీట్లపై పడి కొట్టుకున్నారు. ఈ ఘటనను అక్కడి విద్యార్థుల్లో ఒకరు వీడియో తీశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులు, స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఘటనలో దాడికి పాల్పడ్డ బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేసింది. విచారణ అనంతరం డ్రైవర్‌ను పూర్తిగా విధుల్లోంచి తొలగించే అవకాశం ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కూడా స్పందించారు.
Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు
బస్సు డ్రైవరే అనవసరంగా దాడికి పాల్పడ్డాడని, అసభ్య పదజాలం వాడాడని చెప్పారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఆ బాలిక తను చెప్పినట్లు వినకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని డ్రైవర్ అన్నాడు. తాను బాలికను సీట్లో కూర్చొమ్మని చెప్పినప్పటికీ ఆమె వినలేదని, పైగా తనపైకి దూసుకొచ్చిందని, అందువల్లే తాను తిరిగి దాడి చేశానని డ్రైవర్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
