PM Modi: రిషి సునాక్‌కు మోదీ ఫోన్.. కలిసి పనిచేద్దామని పిలుపు.. వాణిజ్య ఒప్పందంపై చర్చ

బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు అనేక అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. గురువారం రిషి సునాక్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

PM Modi: రిషి సునాక్‌కు మోదీ ఫోన్.. కలిసి పనిచేద్దామని పిలుపు.. వాణిజ్య ఒప్పందంపై చర్చ

PM Modi: బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. గురువారం మోదీ.. రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సునాక్‌కు అభినందనలు తెలిపిన మోదీ, పలు అంశాలపై ఆయనతో చర్చించారు. మోదీ తనను అభినందించడంపై రిషి హర్షం వ్యక్తం చేశారు.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

ఈ అంశంపై రిషి సునాక్, మోదీ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయల్ని పంచుకున్నారు. మోదీ మాటలు తనకెంతో సంతోషాన్నిచ్చాయని సునాక్ అన్నారు. ‘‘ఇండియా, బ్రిటన్ మధ్య ఎంతో సారూప్యత ఉంది. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు భద్రత, రక్షణ, ఆర్థిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాల్సి ఉంది. రాబోయే నెలలు, సంవత్సరాల్లో ఈ ప్రగతి కొనసాగుతుంది’’ అని రిషి సునాక్ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీ కూడా ట్వీట్ చేశారు. ‘‘రిషి సునాక్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపాను. రెండు దేశాల మధ్య సమ్మిళిత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తాం.

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సొంతం చేసుకుంటాం.. రాజ్‌నాథ్ సింగ్

అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అమలు చేసే అంశంపై కూడా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. రిషి సునాక్‌తో ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో కుదుర్చుకోవాలని భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మోదీ చర్చించారు. త్వరలోనే ఈ ఒప్పందాన్ని ఒక కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.