future champion
కొంతమంది పిల్లలు చాలా ప్రత్యేకమైన టాలెంట్స్ కలిగి ఉంటారు. ఇష్టమైన కళ మీద ఆసక్తి.. పేరెంట్స్ ప్రోత్సాహం అన్నీ కలిపి చిన్న వయసులోనే వారిని సెలబ్రిటీలను చేస్తాయి. ఓ చిన్నారిని చూస్తే మీరు ఔరా అంటారు.
MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?
ఓ యువకుడితో ఓ చిన్నారి టేబుల్ టెన్నిస్ ఆడుతోంది. రాకెట్‌ని ఎంతో ఎంతో చురుగ్గా.. కాన్ఫిడెన్స్‌గా కదుపుతూ.. బంతి కింద పడకుండా ఆమె ఆడుతున్న విధానం చూస్తే అందరూ అవాక్కవుతారు. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ లాగ ఆమె ఆడుతున్న విధానం విస్మయానికి గురి చేస్తోంది. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ చిన్నారి వీడియో వైరల్ అవుతోంది. చిన్నారి అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రశంసలతో కురిపిస్తున్నారు.
Instagram Kids : పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ యాప్.. విమర్శలతో ఆపేసిన ఫేస్‌బుక్!
‘ఆ చిన్నారి ఆల్రెడీ ఛాంపియన్ అని .. భవిష్యత్ లెజెండ్’.. అని ట్విట్టర్ యూజర్లు అభినందనలు తెలుపుతున్నారు. ‘ఇంత చిన్న వయసులో టేబుల్ టెన్నిస్‌లో ఇంత ప్రావీణ్యమా?’ అని ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో ఉన్న ఇష్టాలు గమనించడం ఆ దిశగా వారిని ప్రోత్సహించడం పేరెంట్స్ బాధ్యత. సరైన సమయంలో వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఇదిగో ఇలాగే డైమండ్‌లా తయారవుతారు.
Future Champ pic.twitter.com/Fk0EELHrNE
— Top Videos (@TopVideosOnly) April 19, 2023