MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?

చిన్నపిల్లలకి ఏ చిన్న వైద్య పరీక్షలు చేయించాలన్నా భయంతో చాలా ఇబ్బంది పెడతారు. ఇక MRI లాంటి పరీక్షలు అంటే డాక్టర్లు, తల్లిదండ్రుల్ని ముప్పుతిప్పలు పెడతారు. పిల్లల భయాన్ని పోగొట్టే సరికొత్త MRI మెషీన్‌కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?

MRI scanner

MRI scanner : MRI స్కానర్‌‌తో (mri scanner) పరీక్షల సమయంలో పెద్దవాళ్లే భయపడిపోతారు. అలాంటిది పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అయితే ఇప్పుడు పిల్లల కోసం MRI స్కానర్ అంటూ బయటకు వచ్చిన ఓ ఫోటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

MRI స్కానర్‌ని చూడగానే భయం వేస్తుంది. ఇక టెస్ట్‌ల కోసం లోనికి పంపుతున్నప్పుడు పిల్లలైతే కేకలు వేసేస్తారు.. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకు పరీక్షలు చేయడం మహా కష్టంగా మారిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఆ భయాన్ని మర్చిపోయేలా చేసే ఓ సరికొత్త స్కానర్‌కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గొయేంకా (harsh goenka) ఈ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. పిల్లల కోసం వచ్చిన ఈ సరికొత్త MRI స్కానర్ ఆవిష్కారం నిజంగా అభినందనీయం అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశారు. ఇక ఈ మెషీన్ ఎల్లో కలర్‌లో ఉండి ఫిష్ మరియు రకరకాల బొమ్మలతో పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. వాటిని చూసి పిల్లలు భయం లేకుండా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. ఈ ఫోటో చూసిన తరువాత చాలామంది దీని గురించి వివరాలు అడిగారు. పిల్లల భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన మార్గం కాదు కానీ ఇది ఒక మంచి ప్రయత్నమని.. పిల్లల్ని ఆకర్షించే బొమ్మలన్నీ బయట ఉంటే ఏం ప్రయోజనమని మరి కొందరు అభిప్రాయాలు చెప్పారు.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

అయితే ఈ ఫోటో US లోని CS మోట్ పిల్లల ఆసుపత్రి ( CS Mott children’s hospital) వెబ్ సైట్ నుంచి వెలువడింది. ఈ మెషీన్‌లో స్కాన్ చేసే సమయంలో సినిమాలు లేదా బొమ్మలు చూపించే ఫీచర్స్ ఉంటాయట. ఇంకా రకరకాల అనారోగ్యాలతో పరీక్షల కోసం వచ్చే పిల్లలు భయపడకుండా ఆసుపత్రిలో ట్రీ హౌస్, సబ్ మెరైన్ , ఇసుక కోట లాంటి ఆకారాల్లో డిజైన్ చేయబడిన యంత్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారట. ఏది ఏమైనా పరీక్షల సమయంలో పిల్లల భయం పోగొట్టడానికి ఈ ఆసుపత్రి వారికి వచ్చిన ఐడియాకు అభినందించాల్సిందే.