చైనా ప్రభుత్వం : కరోనా వైరస్ నియంత్రణకు 640 మిలియన్ డాలర్లు విడుదల

  • Publish Date - January 29, 2020 / 04:43 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది.చైనాలో వెలుగులోకి వచ్చిన  కరోనా ఇంచుమించు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. కరోనా పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా చైనా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఆ దేశ ఆర్థికశాఖ 4.4 బిలియన్ల యాన్‌లు (640 మిలియన్ US డాలర్లు) కేటాయించింది. 

కరోనా వైరస్ ప్రబలిన సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్సులో దీని నియంత్రణ కోసం 500 మిలియన్ల యాన్ ల నిధులను చైనా ఆర్థికశాఖ విడుదల చేసామని చైనా మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ను నిరోధించేందుకు గత వారం ఒక మిలియన్ల యాన్ లను కేటాయించారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ వల్ల 106 మంది మరణించారు. చైనా నుంచి 12 దేశాలకు ప్రబలిన ఈ వైరస్ ప్రజలను వణికిస్త్తోంది.

కాగా..కరోనా వైరస్ భూతానికి చైనాలోని వుహాన్ నగరంలో 106మంది బలైపోయారు. చైనా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 130మందికిపైగా మరణించగా 1500లకు పైగా వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో అప్రమత్తమైన భారత అధికార యంత్రాంగం దేశంలో వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.