China: ఎముకలు కొరికే చలిలో.. మంచు ఎడారిలో యుద్ధం కోసం ఏ క్షణమైనా రెడీగా ఉండే సైనికుల కోసం China ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మైనస్ 40 డిగ్రీల చలిలో.. 40 అడుగుల ఎత్తు మూసి ఉన్న మంచు వాతావరణంలో ఆహారాన్ని దాచుకుని రెడీగా ఉన్నారు. వారి కోసం ఆహారం, అవసరాలు, బట్టలు అన్నీ ప్రత్యేకంగానే రెడీ చేసింది China.
దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను China మీడియా పబ్లిష్ చేస్తూనే ఉంది.
వింటర్ కోసం ప్రత్యేక గేర్:
చైనీస్ ఫ్రంటియర్ పాట్రోల్ ట్రూప్స్ కోల్డ్ ప్రూఫ్ హుడ్స్, వార్మ్ ట్రైనింగ్ క్లాత్స్, లైట్ వెయిట్ కోల్డ్ ప్రూఫ్ వార్మ్ ట్రైనింగ్ కోట్స్, మాయిశ్చర్ అబ్సార్బింగ్, క్విక్ డ్రైయింగ్ అండర్‌వేర్, వార్మ్ ఫ్లీస్ అండర్‌వేర్, డౌన్ వార్మ్ కాటన్ అండర్‌వేర్, వార్మ్ కాటన్ వెస్ట్స్, కోల్డ్ ప్రూఫ్ ఔటర్ గ్లోవ్స్ లాంటివి సప్లై చేస్తున్నారట.
China స్టేట్ మీడియా ప్రకారం.. ఈ బట్టల కోసం కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ‘ఈ వార్మ్ ట్రైనింగ్ సూట్ ను అధిక సామర్థ్యం కలిగిన పాలీమైడ్ ఫైబర్ తో తయారుచేయడం వల్ల లైట్ వెయిట్ , అధిక బలంతో ఉంటాయి.
దాంతో పాటు అండర్‌వేర్ పోరస్ కొపాలిస్టర్ ఇమిటేషన్ లినెన్ మెటేరియల్స్ తో చేస్తున్నారు. వీటి వల్ల గాలిలో తేమను త్వరగా శోషించుకోగలవు. లైట్ వెయిట్ కోల్డ్ ప్రూఫ్, వార్మ్ ట్రైనింగ్ కోట్ వల్ల థర్మల్ ఇన్సులేషన్ ఎఫెక్ట్ కలిగి టోటల్ వెయిట్ చాలా వరకూ తగ్గుతుంది.
మరోవైపు ఇండియన్ ఫోర్స్ వింటర్ కోసం యునైటెడ్ స్టేట్స్ నుంచి బట్టలు కొనుగోలు చేసింది. ఇండియా టుడే సమాచారం మేరకు లడఖ్ ఏరియా వ్యాప్తంగా బలగాల కోసం 60వేల క్లాథింగ్ సెట్స్ రెడీగా ఉన్నాయట. అంతేకాకుండా మరో 30వేల సెట్స్ కావాల్సి ఉందని చెబుతున్నారు.
స్మార్ట్ క్యాంప్స్:
చలిగాలులను, మంచు కప్పబడిన పర్వతాలను తట్టుకోవడానికి క్యాంపులను స్మార్ట్ గా రెడీ చేస్తున్నారు. ‘స్మార్ట్ క్యాంపుల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. కొన్నేళ్ల కిందట నిర్మించినప్పటికీ.. ఎలక్ట్రిసిటీ, వాటర్, హీటింగ్ ఫెసిలిటీస్, హెల్త్, హైజిన్ లాంటి వాటితో పాటు అకమడేషన్ కూడా అందుబాటులో ఉంటుంది’ అని ఇండియన్ ఆర్మీ ఓ స్టేట్‌మెంట్‌లో చెప్పింది.
ఎల్ఏసీ వద్ద China బలగాల కోసం.. ఏర్పాటు చేసిన క్యాంపులలో ఎంత చలి ఉన్నా.. ఎంత ఎత్తుప్రదేశాల్లో ఉన్నా.,. లోపల మాత్రం దాదాపు ఓ పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుందట.
ఆహారంతో పాటు ఇతర అవసరాలు:
China బలగాల కోసం తాజా కూరగాయలు దాదాపు 12రకాలు అందుబాటులో ఉంటాయట. వీటిలో అత్యధిక భాగం న్యూట్రియంట్-రిచ్ రేషన్స్, సెల్ఫ్ హీటింగ్ ఫుడ్ ఉంటుంది. అది కూడా ఇంప్రూవ్డ్ క్వాలిటీ. డిఫెన్స్ ట్రూప్స్ హాట్ ఫుడ్ తినడం వల్ల హెల్తీగా ఉండగలుగుతున్నారు.
ఇండియన్ ఫోర్సెస్ సైతం చలికాలం వంటలు చేసుకునేందుకు జులై నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆహారం పదార్థాలు, ఇందనాలు, ఇతర పరికరాలతో రెడీగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్స్ లలో వీటిని తరలించారు.