China Snowfall : చైనాలో 116 ఏళ్లలో అత్యధిక హిమపాతం ఇదే!

చైనా రాజధాని బీజింగ్‌లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఈశాన్య నగరం షెన్‌యాంగ్‌లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. ఎడతెగని మంచుతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

China Snowfall : చైనా రాజధాని బీజింగ్‌లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఈశాన్య నగరం షెన్‌యాంగ్‌లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. ఎడతెగని మంచుతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. చైనాలోని ప్రజలు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లియోనింగ్ ప్రావిన్సులో షెన్‌యాంగ్‌లో స‌గ‌టు మంచువర్షం 51 సెంటీమీట‌ర్ల‌ (20 అంగుళాలు)కు చేరుకుంది. 1905 త‌ర్వాత సిటీలో కురిసిన అత్య‌ధిక హిమ‌పాతం ఇదేనని చైనా వార్తా సంస్థ వెల్లడించింది. తీవ్ర మంచు కారణంగా మంగోలియాతో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఒక‌రు మృతిచెందారు. భీక‌ర మంచు తుఫాన్ కారణంగా 5600 మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక‌స్మాత్తుగా మంచు తుఫాన్ కురియడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంగోలియా ప్రాంతంలో మంచు తుఫాన్‌పై 27 సార్లు రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు.

కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్‌కు చేరుకున్నాయి. భారీ మంచు కురియడంతో లియానింగ్ సిటీలో ట్రాఫిక్ స్తంభించింది. అన్ని టోల్స్‌ను క్లోజ్ చేయగా.. రైళ్లు, బ‌స్సుల‌ను కూడా రద్దు చేశారు. పక్కనే ఉన్న మంగోలియాలో, భారీ మంచు తుఫాను కారణంగా ఒకరు మరణించారు 5,600 మందికి పైగా ప్రభావితమయ్యారు. మంగోలియన్ నగరమైన టోంగ్లియావోలోని వాతావరణ పరిశోధకుల ప్రకారం.. మంచు తుఫాను చాలా యాదృచ్ఛికంగా ఏర్పడిందని, ఇధి తీవ్రమైన వాతావరణ సంఘటనగా తెలిపారు. ఇన్నర్ మంగోలియా, ఈశాన్య చైనా అంతటా మొత్తం 27 రెడ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.

మంచు తుఫానులపై అత్యవసర హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వం. ఆదివారం పూట ప్రారంభమైన చలిగాలుతో ఈశాన్య చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనీసం 14 డిగ్రీల మేర పడిపోయాయి. భారీ హిమపాతం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మంగళవారం వరకు ఎక్స్‌ప్రెస్‌వే టోల్ స్టేషన్‌లు మూతపడ్డాయి. డాలియన్, దండోంగ్ నగరాల్లో మినహా రైలు బస్ స్టేషన్లు మూతబడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబరులో విద్యుత్తు అంతరాయాలతో ప్రభావితమైన ప్రాంతాలలో చైనా ఈశాన్య ప్రాంతం ఒకటి.. పెరుగుతున్న ఖర్చులు, బొగ్గు కొరతకు కారణంగా మారుతుందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Read Also : Air pollution in Delhi : ఢిల్లీని క‌మ్మేసిన కాలుష్య భూతం..!

ట్రెండింగ్ వార్తలు