Indian Ocean-China : మయన్మార్ మీదుగా హిందూ మహాసముద్రంలోకి చైనా..కొత్త రైల్వే లైన్ ప్రారంభం

మయన్మార్‌ గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది.

Indian Ocean-China సముద్ర-భూమి-రైలు లింక్‌ను ఉపయోగించి చైనా హిందూ మహాసముద్రానికి కీలకమైన మార్గాన్ని ప్రారంభించింది. మయన్మార్‌  గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌(రాష్ట్రం) రాజధాని చెంగ్డూ నుండి యునాన్ ఫ్రావిన్స్ లోని “లిన్ సాంగ్” సిటీ వరకు ఈ రైల్వై లైన్ ఉంటుంది. కాగా, మయన్మార్‌ ఈశాన్య రాష్ట్రం షాన్‌ లోని సరిహద్దు పట్టణం చిన్ షావె హా(వాణిజ్య పట్టణం)కి..లిన్ సాంగ్ కొద్ది దూరంలోనే ఉంటుంది. పశ్చిమ చైనాను హిందూ మహా సముద్రంతో కలిపే మొదటి లైను ఇదే.

ALSO READ  Zimbabwe : పూర్తిగా చైనా కంట్రోల్ లో జింబాబ్వే

మయన్మార్‌ సరిహద్దు ప్రాంతం మీదుగా సింగపూర్‌కు వాణిజ్యాన్ని సులువుగా నిర్వహించేందుకు చైనాకి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రైల్వే లైన్ వల్ల సింగపూర్‌ ఓడరేవు నుండి మయన్మార్‌ ద్వారా చైనాకి సరుకులు రావడానికి వీలవుతుంది. కొత్త మయన్మార్-చైనా మార్గం సింగపూర్ నుండి చెంగ్డు వరకు సరుకు రవాణా సమయాన్ని 20 రోజుల పాటు తగ్గిస్తుంది.. అంతేకాకుండా చైనా ఎగుమతులు ఇరుకైన మలక్కన్ జలసంధి నుండి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది

సింగపూర్ పోర్ట్ నుంచి వచ్చే సరుకు మొదట మయన్మార్ లోని “యన్ గాన్ పోర్టు”(మయన్మార్ యొక్క 90శాతం ఎగుమతులు,దిగుమలు ఈ పోర్ట్ గుండానే జరుగుతాయి)కి చేరుకుని..ఇక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా చిన్ షావె హా(మయన్మార్ లోని పట్టణం)కి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రైలు మార్గం ద్వారా లిన్ సాంగ్ మీదుగా చెంగ్డూకి సరుకు చేరుతుంది. కాగా,రైలు మార్గం ద్వారా సరుకు లిన్ సాంగ్ నుంచి చెంగ్డూ చేరుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుందని మయన్మార్ లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది కాగా, ఆగస్టు 27న ప్రయోగాత్మకంగా ఈ మార్గం గుండా సరుకును రవాణా చేసినట్లు చైనా తెలిపింది

సింగపూర్‌-మయన్మార్‌-చైనాలను కలుపుతున్న ఈ మార్గం ప్రస్తుతమున్న అత్యంత సౌకర్యవంత మైన భూ, సముద్ర మార్గమని చైనా తెలిపింది. దీనివల్ల సరుకుల రవాణాకు పట్టే సమయం గణనీయంగా 20- 22 రోజుల వరకు తగ్గుతుందని తెలిపింది. మయన్మార్ కి ఆదాయ వనరును అందించే సమయంలో… చైనా మరియు మయన్మార్‌లకు అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం జీవనాడిగా మారుతుందని భావిస్తున్నారు. మరోవైపు,మయన్మార్ లోని రఖీనే రాష్ట్రంలో మరో వ్యూహాత్మక ఓడరేవును అభివృద్ధిపరచడానికి కూడా చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, మయన్మార్‌లో అశాంతి కారణంగా అక్కడ పురోగతి నిలిచిపోయింది.

మరోవైపు ,చైనా యొక్క “బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) లో భాగంగా.. మయన్మార్- చైనాల మధ్య అంగీకరించబడిన సరిహద్దులోని మూడు ఆర్థిక సహకార జోన్లలో చిన్ షావె హా ఒకటి. 2013 నుండి, చైనా యొక్క ప్రధాన BRI ప్రాజెక్ట్.. వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా మరియు రష్యా ద్వారా చైనా నుండి యూరోప్‌కు కనీసం 70 దేశాలను అనుసంధానించడానికి రోడ్లు, రైలు మరియు షిప్పింగ్ మార్గాల ప్రపంచ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది

ALSO READ  China-Sri Lanka : ఉత్తర శ్రీలంకలో చైనా ఆదిపత్యం..భారత్ ఆందోళన!

ట్రెండింగ్ వార్తలు