Zimbabwe : పూర్తిగా చైనా కంట్రోల్ లో జింబాబ్వే

చాలా ఆఫ్రికా దేశాల మాదిరిగానే జింబాబ్వే కూడా ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోలోకి వెళ్లిపోయింది.

Zimbabwe : పూర్తిగా చైనా కంట్రోల్ లో జింబాబ్వే

Zimbabwe

Zimbabwe చాలా ఆఫ్రికా దేశాల మాదిరిగానే జింబాబ్వే కూడా ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోలోకి వెళ్లిపోయింది. జింబాబ్వే రాజకీయాలు,మిలటరీ,ఆర్థిక విధానాలు అన్నింటినీ చైనానే నియంత్రిస్తోంది. జింబాబ్వే ఎకానమీలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో..పూర్తిగా చైనా ముందు తలవంచింది జింబాబ్వే. ఇక, స్థిరమైన రుణ డిఫాల్ట్‌ల కారణంగా తమ ఆస్తులను ఎక్కడ చైనీయులు లాగేసుకుంటారమేననే భయంతో ఉన్నారు జింబాబ్వే వాసులు.

జింబాబ్వేలో చైనా యొక్క అధికారాన్ని మరియు పట్టును స్థానిక కార్మిక దళానికి చెందిన చైనా యజమానులు అనేక రకాలుగా దుర్వినియోగం చేసినప్పటికీ జింబాబ్వే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. జింబాబ్వేలో చైనా పెత్తనం ఏ స్థాయికి చేరిందనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఇటీవల తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని ఓ గనిలో పనిచేసే స్థానిక కార్మికులు డిమాండ్ చేయగా.. చైనా కంపెనీ యజమాని ఆ కార్మికులను కాల్చి చంపేశారు. ఇంతజరిగినా చైనీయులపై చర్యలు తీసుకునేందుకు జింబాబ్వే ప్రభుత్వం భయపడుతోంది.

చైనీస్ కంపెనీ యజమానులు జింబాబ్వే చట్టాన్ని, పౌరుల చట్టపరమైన హక్కులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా, జింబాబ్లేలోని కార్మికులపై వివక్ష చూపుతూ వారికి తక్కువ వేతనాలను చెల్లిస్తుంటారు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు,కనస్ట్రక్షన్ ప్రాజెక్టులలో మరియు మైనింగ్ గనుల్లో పనిచేసే కార్మికులకు చాలా తక్కువగా.. అంటే కేవలం 35 డాలర్లు(2600)భారత కరెన్సీలో మాత్రమే నెల వేతనంగా చెల్లిస్తుంటారు. ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా..కార్మికులను ప్రమాదకరమైన, అమానవీయమైన, కఠినమైన మరియు ప్రాణాంతకమైన పరిస్థితులలో బలవంతంగా పనిచేయిస్తుంటారు. ఇక,వసతిగృహాల్లో అయితే..కరోనా పరిస్థితుల్లో ఓ చిన్న గదిలో పదుల సంఖ్యలో కార్మికులను ఉంచుతున్నారు.

అయితే చైనా కంపెనీల యజమానుల దాష్ఠీకాలకు వ్యతిరేకంగా తమ గళం గట్టిగా వినిపిస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ ది జింబాబ్వే కాంగ్రెస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్(ZCTU). ఈ క్రమంలో చైనీస్ దౌత్యవేత్తలు రంగంలోకి దిగి.. యూనియన్ నాయకులతో స్నేహపూర్వక పరిష్కారాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. పని పరిస్థితులను మెరుగుపర్చడానికి కృషి చేస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. అయితే ఆచరణలో దాన్ని చైనా కంపెనీల యజమానులు విస్మరించారు.

ఆఫ్రికాలో మరియు ముఖ్యంగా జింబాబ్వేలో చైనా ప్రయోజనాలను ప్రభావితం చేసే సమస్యలను హైలైట్ చేయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా కంపెనీల యజమానులను ZCTU నాయకులు హెచ్చరించారు. జింబాబ్వే ప్రభుత్వం.. తమ సమస్యలను చైనా కళ్లతో చూస్తుందని, అందువల్ల కార్మికుల సంక్షేమం కోసం వ్యూహాలను రూపొందించలేకపోతోందని ZCTU ఆరోపిస్తోంది. ఫ్యాక్టరీ స్థలంలో స్థానిక కార్మికులు మరణించినప్పటికీ, మరణించిన వారి కుటుంబానికి పరిహారం చెల్లించకుండా ఉండటానికి వారి మరణాలను చైనా యజమానులు దాచిపెట్టారని ZCTU యూనియన్..జింబాబ్వే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. చైనా దురాగతాలను హైలెట్ చేస్తూ ZCTU సెక్రటరీ జనరల్ జపేత్ మయో..ఓ సోషల్ మీడియా క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. కాలక్రమేణా, జింబాబ్వేలో చైనీస్ వ్యతిరేక భావాలు క్రమంగా పెరుగుతున్నాయి. చైనా స్వార్థ ప్రయోజనాల కోసం తాము అణచివేయబడ్డామని జింబాబ్వే ప్రజలు గ్రహించడం ప్రారంభించారు. అదేవిధంగా జింబాబ్వేలోని గోల్డ్,క్రోమ్ వంటి విస్తారమైన వనరులను కూడా చైనా కొల్లగొడుతోందని జింబాబ్వేలోని ఓ నేత తెలిపారు. తమ దేశంలోని వారసత్వ కట్టడాలను కూడా చైనా నాశనం చేస్తోందని తెలిపారు.

చైనా చేపట్టిన ప్రాజెక్టులలో దుర్వినియోగం పక్కనబెడితే.. జింబాబ్వే యొక్క రాజకీయ మరియు సైనిక నాయకత్వం చైనా చెప్పినదానికల్లా తలాడిస్తున్న విధానం నుండి దేశం యొక్క ఎదుగుదలపై ప్రభావాన్నిచూపిస్తోంది. 2017 నవంబర్ లో జింబాబ్వే మిలటరీ చీఫ్ ఆకస్మికంగా చైనా పర్యటనకు వెళ్లడం..ఆ తర్వాత జింబాబ్వేలో ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి సైన్యం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇదంతా యాధృచ్చికం అని చాలా మంది రాజకీయ,భద్రతా విశ్లేషకులు అంటున్నప్పటికీ..తమ చెప్పుచేతల్లో లేకుండా.. జింబాబ్వేలో తమ ప్రయోజనాలు దెబ్బతీసుకునండా చైనానే ఈ ఎత్తుగడ వేసినట్లు కూడా పులువురు చెబుతుంటారు.

ఆసక్తికరంగా, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన చైనా యొక్క ‘లుక్ ఈస్ట్’ విధానం జింబాబ్వేలో చాలా విజయవంతమైంది. జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే ఒకసారి రాజదాని హరారేలో చైనా నిర్మించిన స్పోర్ట్స్ స్టేడియం నుండి…తాము తూర్పు వైపు తిరిగామని(సూర్యుడు ఉదయించే వైపు)మరియు మా వెన్నుని వెస్ట్ వైపు ఉంచామని(సూర్యుడు అస్తమించే వైపు) ప్రకటించారు.

జింబాబ్వే యొక్క రాజకీయ మరియు వ్యూహాత్మక వ్యవహారాలపై నియంత్రణ సాధించే విషయంలో..దేశ భద్రతా ఉపకరణాలు మరియు ప్రెసిడెన్సీకి నేరుగా సాంకేతిక మద్దతు అందించడంలో పెట్టుబడి పెట్టిన ఏకైక దేశం చైనా. జింబాబ్వేలో చైనీయుల ప్రధాన పాత్ర మౌలిక సదుపాయాలను నిర్మించడమే అయినప్పటికీ జింబాబ్వేపై ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉండాలని నిశ్చయించుకుని తన సాంకేతిక సామర్థ్యాలను మరియు నిఘా సామర్థ్యాలను దేశంలోని ప్రతి మూలను పర్యవేక్షించడానికి వీలు కల్పించే లక్ష్యంతో ప్రారంభించింది డ్రాగన్ దేశం.

జింబాబ్వే యొక్క రక్షణ మరియు పార్లమెంటరీ కార్యకలాపాలపై పూర్తి అధికారం పొందే ప్రయత్నాల్లో భాగంగా..నేషనల్ డిఫెన్స్ కాలేజీని నిర్మించడం మరియు రాజధాని హరారేలో 650 సీట్ల సామర్థ్యమున్న పార్లమెంట్ హౌస్‌కు ఆర్థిక సహాయం చేసింది చైనా. ప్రస్తుతం జింబాబ్వేకి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) టెక్నాలజీని ఎగుమతి చేయడంలో చైనా నిమగ్నమై ఉంది. ఈ యంత్రాంగాల ద్వారా, జింబాబ్వే జాతీయులు, సైనిక మరియు ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

నూతన ఆవిష్కరణల పేరిట.. చైనా ప్రభుత్వం జింబాబ్వేలోని దాదాపు అన్ని రంగాలలో కార్యకలాపాల కోసం దేశీయ AI సాంకేతికతను ఎగుమతి చేయడం ద్వారా జాతీయ భద్రత మరియు కమ్యూనికేషన్ సంబంధిత ఉపకరణాలను ప్రభావితం చేయడం ద్వారా దేశంలో తన పట్టును బలోపేతం చేసుకుంది.

ఇప్పటివరకు చైనా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించి జింబాబ్వేలో 20 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిందని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విస్తరణ కోసం సమీప భవిష్యత్తులో 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. మెరుగైన జీవన విధానాన్ని పొందవచ్చన్న ఆశతో జింబాబ్వే కూడా చైనా AI వ్యవస్థను తమ దేశ రక్షణ మరియు భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అంగీకరించింది. ఈ ప్రక్రియలో ఆర్థిక గూఢచర్యం మరియు రాజకీయ నిఘా ద్వారా.. చైనా గూఢచార సేకరణకు సహాయం చేస్తోంది.