China provid Modern Weapons To Talibans : తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తున్న చైనా.. డ్రాగన్ కుట్రల వెనుక పక్కా ప్లాన్

అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా..చైనా మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. అప్ఘానిస్థాన్‌ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని...తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పుడు తాలిబన్ల పాలనను స్థిరీకరించేందుకు సాయం చేస్తోంది. తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది.

China provid Modern Weapons to Talibans : అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా..చైనా మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. అప్ఘానిస్థాన్‌ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని…తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పుడు తాలిబన్ల పాలనను స్థిరీకరించేందుకు సాయం చేస్తోంది. తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. తాలిబన్ల నీడలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు..పుస్తకం రచయిత జాఫర్ ఇక్బాల్ యూసఫ్ జాయ్ ఈ విషయం వెల్లడించారు.

కాబూల్‌లో గత డిసెంబర్ 12న ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు ఓ హోటల్‌పై దాడిచేశారు. చైనీయుల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ హోటల్‌లో బసచేసిన వారిలో ఎక్కువమంది చైనీయులే. హోటల్ నిర్వాహకులు కూడా చైనీయులే. మొత్తం 18మంది గాయపడ్డారు. చైనా ప్రతినిధులు, వ్యాపారులు ఈ హోటల్‌కు తరచుగా వస్తుంటారు. ఈ ఘటన తర్వాత చైనా…తాలిబన్ల ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతుగా ఉండేందుకు సిద్ధమయింది. ఉగ్రవాదులను తాలిబన్లు సమర్థవంతంగా ఎదుర్కొంనేందుకు మానవ రహిత విమానాలు సహా అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది.

అప్ఘానిస్థాన్‌తో చైనాకు అనేక ప్రయోజనాలున్నాయి. అప్ఘాన్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. గల్ఫ్, ఇరాన్‌తో చైనాను కలిపేది అప్ఘానిస్తానే. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వంటివాటికి అప్ఘాన్ కీలకమైనది. అందుకే తాలిబన్లకు మానవతాసాయం, ఆయుధసాయం అందించడంతో పాటు తాలిబన్ల పాలనకు ప్రపంచ మద్దతు కూడగట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది. 2021లోనే మానవరహిత ఏరియల్ వాహనాలు, డ్రోన్లు చైనా తాలిబన్లకు అందించింది. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న మరుసటి నెలే…ఈ అమ్మకాలు జరిగాయి. అంటే ఆగస్టులో తాలిబన్లు అఫ్ఘానిస్థాన్ ను ఆక్రించుకుంటే సెప్టెంబర్ లో చైనా తాలిబన్లకు ఏరియల్ వాహనాలు,డ్రోన్లు అందజేసింది.

రెండు దశాబ్దాల తర్వాత రిక్తహస్తాలతో అప్ఘానిస్థాన్ నుంచి అమెరికా సంయుక్త బలగాలు వైదొలగడంలో చైనా పాత్ర ఉందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. తాలిబన్లకు తెరవెనక చైనా అన్నీ తానై వ్యవహరించిందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు. పాకిస్థాన్ తెర ముందు ఉంటే…తెర వెనక చైనా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించాయని తెలిపారు. అయితే అప్ఘానిస్తాన్‌పై వైఖరితో పాకిస్థాన్‌ ఇబ్బందులు పడుతోంది. అమెరికా, పాకిస్థాన్ మధ్య చిరకాల మిత్ర బంధం దెబ్బతింది. అదే సమయంలో చైనా, పాకిస్థాన్ బంధం మాత్రం బలోపేతమవుతోంది. చైనా-పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ మంచి మిత్రదేశాలుగా మారాయి. ఈ కూటమి కొన్ని ఉగ్రవాదసంస్థలకు ఉమ్మడి శత్రువుగానూ ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు