China vaccination drive : ప్రభుత్వం ఆఫర్స్ ఇస్తున్నా..వ్యాక్సిన్ వద్దు అంటున్న చైనీయులు

China vaccination drive with free eggs, other goods : కరోనాతో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా అదే పరిస్థితి. మీరు వ్యాక్సిన తెస్తే నేను సెకండ్ వేవ్ ఏంటో చూపిస్తానంటోంది మహమ్మారి. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ ను ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఎన్ని ఆంక్షలు పెట్టిన పట్టించుకోవట్లేదు. వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడినంత సమయం కూడా లేదు..కరోనా తన ప్రతాపాన్ని పెంచిన తీరుచూస్తుంటే…చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు పాకిందనే వార్తలు పాతబడిపోయినా చైనాలో మాత్రం కరోనా గురించి పట్టించుకోవటం మానేసినట్లుగా ఉంది పరిస్థితి చూస్తుంటే.

ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకోమని ప్రభుత్వం నెత్తీ నోరు కొట్టుకుంటోంది. అయినా జనాలు పట్టించుకోవట్లేదు. వ్యాక్సిన్ వేయించుకునేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చైనా ప్రభుత్వం ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చేయటానికి ప్రోత్సహకాలు ప్రకటించింది. ఓ వైపుఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నా చైనీయులు మాత్రం టీకా వేయించుకోవడానికి ముందుకురావడం లేదు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ప్రజలందరూ టీకాలు వేయించుకునేలా ప్రోత్సాహకాలు ప్రకటించింది.

వ్యాక్సిన్ వేయించుకుంటే గుడ్లు ఫ్రీ అని ప్రకటించింది. ఏం అక్కర్లేదన్నారు జనాలు. అలాగే టీకా వేయించుకుంటే స్టోర్‌ కూపన్లు ఫ్రీ అని ప్రకటించింది. పట్టించుకోలేదు. రేషన్‌ పై డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. వాక్సిన్‌ వేయించుకున్న వారికి బీజింగ్‌ హెల్త్‌ సెంటర్‌ లో దాదాపు 3 కెజీల గుడ్లను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే షాంఘై వంటినగరాల్లో షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు వర్తింపచేస్తున్నారు. కానీ జనాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించటంలేదు.

అలా ప్రజలకు ఆఫర్లు ప్రకటించి వ్యాక్సిన్ వేయించుకునేలా చేస్తున్న క్రమంలో ఇప్పటివరకు చైనాలో 19 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మరి మిగిలిన 100కోట్ల మంది ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అంతవరకు ఈ ఆఫర్లను ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు