China Daily Covid Cases : చైనా, యుకేలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు..!

China Daily Covid Cases : డ్రాగన్ చైనా, యూకేలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

China Daily Covid Cases : డ్రాగన్ చైనా, యూకేలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ రెండు దేశాల్లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఒక్కరోజే సుమారుగా 20వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఓ నివేదిక ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనా కరోనాను కట్టడి చేసేందుకు జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, ఈ ప్రయత్నం విఫలం కావడంతో చైనాలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘైలో ఒమిక్రాన్‌ వేరియంట్ రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో లాక్‌డౌన్‌ విధించడంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపైనా కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. దేశంలో కరోనా పరిస్థితులు మరింత అద్వాన్నంగా మారుతున్న నేపథ్యంలో చైనా ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. చైనాలో కొత్తగా రోజువారీ కరోనా కేసులు 20వేలకు పైనే నమోదయ్యాయని నివేదికలు వెల్లడించాయి. అయితే కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. చైనాలోని షాంఘై నగరంలో దాదాపుగా 80 శాతం వరకు కరోనా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడి చేసేందుకు చైనా లాక్ డౌన్లను కూడా అమలు చేస్తోంది. కరోనా నిర్బంధంలో షాంఘై ప్రజలందరికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

China Reports 20,000 Daily Covid Cases, Highest Since Start Of Pandemic

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లండ్‌లో మార్చి నుంచి అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA.2 కేసులు నమోదవుతున్నాయి. ఈ తరహా కేసులపై ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ నేతృత్వంలోని రియాక్ట్‌-1 అధ్యయనం వెల్లడించింది. ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, 90శాతం కేసులే ఈ వేరియంట్ సంబంధించినవే ఉన్నాయని తెలిపింది. కరోనా తీవ్రత పెరిగిపోతున్న సమయంలో బాధితులతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి క్షీణించడంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ముఖ్యంగా 55ఏళ్లు పైబడిన వారిలో కొత్త వేరియంట్ బారిన అధికంగా పడుతున్నారని అధ్యయనంలో తేలింది.

Read Also : China Covid Cases Report : ఒక్కరోజే 16,400 కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ కల్లోలం.. లాక్‌డౌన్ విధించినా..

ట్రెండింగ్ వార్తలు