Delta Variant : డెల్టా వేరియంట్ కు చెక్ పెడుతున్న చైనా

కరోనా పుట్టిన చైనా మొదట్లో మహమ్మారిని ఎలా కంట్రోల్ చేసిందో తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి దేశంలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ కు కూడా అలాగే చెక్ పెడుతోంది..

Delta Variant In Chaina : క‌రోనా వైరస్ పుట్టిన చైనాలో తిరిగి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభలిన మొదట్లో చైనా ఎంత పట్టుదలతో కరోనాను అడ్డుకుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ కరోనా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు పాకిపోయింది. ఇప్పటికీ ఈ మహ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతునే ఉన్నాయి.ఫస్ట్ వేవ్..సెకండ్ వేవ్ అంటూ విడతలవారీగా జనాలను పొట్టనపెట్టుకుంది. ఈక్రమంలో కరోనా రకరకాల వేరియంట్లుగా మారి జనాలను భయపెడుతోంది. ఈక్రమంలో చైనాలో డెల్టా వేరియంట్ కేసులు హడలెత్తిస్తున్న క్రమంలో డ్రాగన్ దేశం ఈ డెల్టా వేరియంట్ కు చెక్ పెడుతోంది.

వైర‌స్‌ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటోంది. కేసు నిర్ధారణ అయిన వెంటనే దాన్ని కట్టడి చేయటానికి వ్యాప్తి కాకుండా నియంత్రించటానికి కఠిన చర్యలుతీసుకుంటోంది.దీంట్లో భాగంగా ఈ కేసులు ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అత్యంత కఠిన ఆంక్షలు పెడుతోంది.తద్వారా కేసుల్ని కట్టుడి చేస్తోంది.ఉన్న కేసుల్ని వెంటనే ఖతం చేయటానికి చర్యలు తీసుకుంటోంది. చైనా తీసుకున్న ఈ కఠిన చర్యలు ఎంత మంచి ఫలితాలను చూపుతున్నాయంటే..

దీంతో గత సోమ‌వారం (23,2021) రోజున చైనా దేశవ్యాప్తంగా ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు. అంటే చైనా తీసుకున్న చర్యలు ఎలాంటి ఫలితాలనిచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో జూలై త‌ర్వాత జీరో కేసులు నమోదు కావ‌డం ఇదే తొలిసారి అని నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ తెలిపింది. చైనాలో డెల్టా వేరియంట్ జూలై 20 నుంచి చాలా ఫాస్టుగా వ్యాపించింది. నాన్‌జింగ్ న‌గ‌రంలోని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో తొలిసారి డెల్టా కేసులు బ‌య‌ట‌ప‌డిన విషయం తెలిసిందే. ఇవి కాస్తా వ్యాప్తికి తోడ్పడ్డాయి. కొన్ని రోజుల్లోనే 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు నమోదు అయ్యాయి. దీంతో చైనా వెంటనే అప్రమత్తమైంది. కఠిన చర్యల్ని తీసుకుంది. ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. కేసులు నమోదు అయిన ఇళ్లకు తాళాలు వేసి వారిని బయటకు రాకుండా చేసింది. అనవసరంగా బయటకొస్తే అదుపులోకితీసుకుని క్యారంటైన్ కు పంపిస్తామని హెచ్చరించింది.

డెల్టా వేరియంట్ కేసుల్ని వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు తీసుకుంది. అత్యంత దూకుడగా వ్యాప్తి చెందుతున్న డెల్లా వేరియంట్ కు చైనా చెక్ పెట్టింది. టెల్టా వ్యాప్తిని చాలెంజ్‌గా తీసుకున్న చైనా ఆ వైర‌స్ వేరియంట్‌ను స‌మ‌ర్థ‌వంతంగా కట్టడి చేస్తోంది. ఎక్కడ కేసు నిర్దారణ అయితే ఆ ప్రాంతంలో అత్యంత కఠిన ఆంక్షలు విధించింది. వ్యాప్తిని నివారించేది.

ఎంతటి కఠిన చర్యలంటే..
డెల్టా కేసులు న‌మోదు కాగానే.. స్థానిక ప్ర‌భుత్వాలు ల‌క్ష‌లాది మందిని క‌ఠిన‌మైన లాక్‌డౌన్‌లో ఉంచారు. భారీ స్థాయిలో టెస్టింగ్‌, ట్రేజింగ్ చేప‌ట్టారు. స్వ‌దేశీయంగా ప్ర‌యాణాల‌ను నిలిపివేశారు. చాలా క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లు చేయ‌డం చైనా మంచి ఫలితాలను సాధించింది. రోజు వారీ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గాయి. వంద‌ల సంఖ్య నుంచి సింగిల్ డిజిట్‌కు వచ్చేలా చేసింది.

చైనాలో గత సోమ‌వారం విదేశాల నుంచి వ‌చ్చిన‌వారిలో 21 కేసులు న‌మోదు కాగా..స్థానికంగా మాత్రం ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాకపోవటం గమనించాల్సిన విషయం. ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని, ల‌క్ష‌ణాలు లేని వారి గురించి చైనా ప్ర‌భుత్వం వేరువేరు డేటాను రూపొందిస్తోంది. అలాగే వేరియంట్ ల‌క్ష‌ణాలు లేని వారిని.. వైర‌స్ పాజిటివ్ కేసుల్లో క‌ల‌ప‌డంలేదు.

ఒక‌వేళ ఇదే ట్రెండ్ కొన‌సాగితే.. ప్ర‌పంచంలో డెల్టా వేరియంట్ దూకుడును అడ్డుకున్న తొలి దేశంగా చైనా నిలుస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వ‌ల్ల చాలా దేశాలు త‌మ స‌రిహ‌ద్దుల్ని మూసివేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నిలిపివేశాయి. ఆస్ట్రేలియాలో అయితే ప‌లు న‌గ‌రాల్లో లాక్‌డౌన్ అమ‌లు కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు