China : ఎవరెస్ట్‌ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చైనా

చైనా ఏం చేసినా అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. ఎవరెస్ట్‌ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది చైనా.

China world’s highest weather station on Mount Everest : చైనా ఏం చేసినా అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. కృతిమ సూర్యడిని, చంద్రుడిని తయారు చేసినా..టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా ఏం చేసినా అది ప్రపంచానికి ఓ అద్భుతంలా అనిపిస్తుంది. అటువంటి చైనా మరో ఘనకార్యాన్ని చేసింది. అదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఔరా అనిపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత ఎతైన శిఖరం ఎవరెస్ట్‌ శిఖరం అనే విషయం తెలిసిందే. అదే శిఖరంపై.. సముద్ర మట్టానికి 8,830 కిలోమీటర్ల ఎత్తులో బుధవారం (మే 4,2022)వాతావరణ కేంద్రాన్ని నిర్మించింది చైనా. ఈ విషయాన్ని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతో పాటు.. డేటా ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు 8,430 కిలోమీటర్ల ఎత్తులో ఎవరెస్ట్‌ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే.. అత్యంత ఎత్తైనది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది.

శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఈ కేంద్రం సౌర ఫలకాల విద్యుత్ సాయంతో స్వయంగా పనిచేయగలుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి 12 నిమిషాలకోసారి ప్రసారం చేసేలా దీని రేడియో స్టేషన్‌ను కోడ్ చేశారు. రెండేళ్ల వరకు పనిచేసేలా దీన్ని డిజైన్ చేశారు. బ్రిటిష్, అమెరికా శాస్త్రవేత్తలు గతంలో సముద్ర మట్టానికి 8430 మీటర్ల ఎత్తులో ఎవరెస్టు శిఖరం దక్షిణం వైపు వాతావరణ కేంద్రాన్ని నెలకొల్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఈ కొత్త కేంద్రం అధిగమించింది.

ట్రెండింగ్ వార్తలు