China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!

China Solar Plant : అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం.. ప్రపంచ దేశాలన్నీ ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం అందరికంటే ముందే పని షురూ చేసింది.

China Solar Plant : అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం.. ప్రపంచ దేశాలన్నీ ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం అందరికంటే ముందే పని షురూ చేసింది. అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తోంది. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టినట్టుగానే.. అక్కడి నుంచి భారీగా సోలార్ పవర్ జనరేట్ చేయాలనేది చైనా ఆలోచన.. ఇప్పుడు ఆ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ప్రాజెక్టు పట్టాలెక్కించేసింది. 2028 నాటికి అంతరింలో ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా చైనా ముందుకు దూసుకుపోతోంది. అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పతి చేయవచ్చునని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు పరిశోధనలు మొదలుపెట్టేశాయి. చైనా మరో అడుగు ముందుకేసి సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

డ్రాగన్ చైనా మొదటి ప్రయత్నంలోనే చంద్రుడిపైకి రోవర్స్ పంపి.. మూన్ శాంపిల్స్ విజయవంతంగా తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు చైనా మొదటి సౌరశక్తితో నడిచే ప్లాంట్‌ను అంతరిక్షంలో ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభ దశలో ఉందని నివేదికలు వెల్లడించాయి. 2028 నాటికి ఈ ప్లాంటును ప్రారంభించడమే లక్ష్యంగా ఏజెన్సీ పెట్టుకుంది, ముందుగా అంచనా సమయం కన్నా రెండు ఏళ్లు ముందుగానే పూర్తి చేయాలని భావిస్తోంది. సౌర అంతరిక్ష కేంద్రంలో సౌర శక్తిని చైనా విద్యుత్ మైక్రోవేవ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

China To Set Up First Solar Power Plant In Space By 2028 

కక్ష్యలో కదులుతున్న ఉపగ్రహాలకు శక్తిని అందించేందుకు ఈ సోలార్ ప్యానెళ్లను ఉపయోగించవచ్చు వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ ద్వారా స్థిరమైన ప్రదేశాలలో పవర్ లేజర్స్ భూమికి పంపవచ్చు. అధికారిక నివేదిక ప్రకారం.. Xidian యూనివర్శిటీ పరిశోధన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సోలార్ స్టేషన్ భూమికి సౌర శక్తిని రవాణా చేయగలదు. ప్రాథమిక దశల్లో విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ అనేది ఒక హాట్‌స్పాట్ టెక్నాలజీగా ఉండే అవకాశం ఉంది.

విద్యుత్ ఉత్పత్తి కోసం.. అంతరిక్ష యాత్ర కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లో వినియోగించనున్నారు. పవర్ ప్లాంట్ 10 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధకులు Xidian యూనివర్శిటీలో లుక్-అలైక్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పొడవైన నిర్మాణం, సుమారు 75 మీటర్ల ఎత్తు, సౌర శక్తి శ్రేణుల కోసం 5 సబ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ OMEGA (ఆర్బ్-షేప్ మెంబ్రేన్ ఎనర్జీ గాదరింగ్ అర్రే)లో ఒక భాగం కూడా. 2014లో లాంచ్ అయిన అంతరిక్షం నుంచి సౌరశక్తిని ఉత్పత్తి చేసే ప్రణాళికగా చెప్పవచ్చు.

భూస్థిర కక్ష్యలో విజయవంతంగా స్థిరపడిన తర్వాత OMEGA అంతిమ లక్ష్యం.. సౌర శక్తిని స్టోర్ చేయడమే. విద్యుత్ శక్తిగా మార్చడం ఆ తర్వాతి ప్రక్రియ. ఆపై ఆ విద్యుత్‍‌ను భూమికి పంపడమే చివరి దశగా చెప్పవచ్చు. చాంగ్‌కింగ్‌లోని బిషన్ ప్రాంతంలో.. అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 33 ఎకరాల టెస్టింగ్ సదుపాయాన్ని నిర్మించనుంది. స్పేస్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు భూమికి తిరిగి పంపించే మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా జీవులు ఎలా ప్రభావితమవుతాయో పరిశోధించనుంది.

Read Also : China: ఐరాసలో భార‌త ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకున్న చైనా

ట్రెండింగ్ వార్తలు