China Wants To Launch Asteroid Deflecting Rockets To Save Earth From Armageddon
Asteroid-Deflecting Rockets : ఆస్ట్రరాయిడ్లు (గ్రహ శకలాలు)లతో భవిష్యత్తులో ఎప్పటికైనా మన గ్రహానికి ముప్పు పొంచి ఉంటుంది.. ఏదో ఒకరోజున భూమిపై జీవరాశులు అంతమయ్యేందుకు ఛాన్స్ ఉంది. రానున్న సంవత్సరాల్లో ఏ క్షణంలోనైనా అంతరిక్షం నుంచి భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇలాంటి పెను విపత్తులను ముందే గుర్తించి వాటి గమనాన్ని మరోవైపు మళ్లించడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటోంది డ్రాగన్ చైనా.. అలాంటి సరికొత్త టెక్నాలజీని కనిపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ‘ఆర్మగెడాన్’ మూవీ అణు బాంబు పద్ధతి మాదిరిగా చైనా శాస్త్రవేత్తలు ఈ ప్లాన్ అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా గ్రహశకలం గమనాన్ని ఆపి పక్కకు మళ్లించాల్సి ఉంటుంది.
ఇందుకోసం చైనా సైంటిస్టులు 20కి పైగా రాకెట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. భూమిపైకి దూసుకొచ్చే Armageddon వంటి ఆస్ట్రరాయిడ్ల గమనాన్ని మరోవైపుకు మళ్లించేందుకు ఈ ఆస్ట్రరాయిడ్ డిప్లెక్టింగ్ రాకెట్లు అవసరం ఉందని చెబుతోంది. గ్రహశకలాల ప్రభావం భూమిపై పడకుండా ఉండేలా ఈ రాకెట్లు అడ్డుకుంటాయని చైనా సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఏళ్లలో Armageddon అనే అతిపెద్ద ఆస్ట్రరాయిడ్ భూమికి ఢీకొట్టబోతోంది. ఈ గ్రహ శకలమే లక్ష్యంగా రాకెట్లను లాంచ్ చేయాలని భావిస్తున్నారు..
ఆ గ్రహశకలానికి Bennu అనే పేరు పెట్టారు. 85.5 మిలియన్ టన్నులు (77.5 మిలియన్ మెట్రిక్ టన్నులు) ఉండే అంతరిక్ష రాతి శకలం.. బెన్నూ ఒక B- రకం గ్రహశకలం.. ఇందులో అధిక మొత్తంలో కార్బన్ ఉంటుంది. ఈ గ్రహ శకలం 2175, 2199 మధ్య భూమి కక్ష్యలో 4.6 మిలియన్ మైళ్ళు (7.5 మిలియన్ కిలోమీటర్లు) లోపలకు దూసుకురానుంది. ఈ గ్రహశకలం ఎంపైర్ స్టేట్ భవనమంతా పొడవుగా వెడల్పుగా ఉండే ఈ గ్రహశకలం.. 2,700లో భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
భూమితో బెన్నూ ప్రభావం దాని గతి శక్తి 1,200 మెగాట్లు ఉంటుందని అంచనా. అంటే.. హిరోషిమాపై పడిన బాంబు శక్తి కంటే సుమారు 80వేల రెట్లు ఎక్కువగా ఉంటుందట.. అలాగే భూమిపై డైనోసార్లు తుడిచిపెట్టేసిన అంతరిక్ష గ్రహశకలం కూడా సుమారు 100 మిలియన్ మెగాటన్ల శక్తిని కలిగి ఉందని ఒక నివేదిక తెలిపింది. చైనా నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు 23 లాంగ్ మార్చి 5 రాకెట్లను లాంచ్ చేయనున్నారు. ఒక్కొక్క రాకెట్ బరువు 992 టన్నుల (900 మెట్రిక్ టన్నులు) ఉంటాయి. ఈ రాకెట్ల ద్వారా రాబోయే భవిష్యత్తు ముప్పును భూమికి దూరంగా మళ్లించడమే లక్ష్యంగా చెబుతోంది.