Chinese employee working at Burger King in Shenzhen, China
Chinese employee: చైనా యువతలో కొత్త ధోరణి కనిపిస్తోంది. నిత్యం బిజీబిజీగా ఉంటూ లక్షల్లో జీతాలు అందుకొనే యువత.. ఇప్పుడు మాకు ఆ ఉద్యోగాలు వద్దంటూ తెగేసి చెప్పేస్తున్నారట. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలనుసైతం సునాయాసంగా వదిలేస్తున్నారు. లక్షల జీతం వద్దు.. ప్రశాంతమైన జీవితం ముద్దు అన్నట్లుగా చైనాలోని యువత ధోరణి మారుతోంది. ఇందుకు కారణం.. పని ఒత్తిడి, పనిభారం, శారీరానికి శ్రమ లేకపోవటంతో పలు అనారోగ్యాల భారిన పడటమేనని తెలుస్తోంది.
Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు
గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో బైట్ డ్యాన్స్ సంస్థలో పనిచేసే ఓ యువతి తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో వంట చేయడంతో పాటు సేల్స్ విభాగాన్ని చూసుకుంటోంది. కొత్త ఉద్యోగం వల్ల తన శరీరం అలసిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటోంది, నేను రోజుకు 140 డాలర్లు సంపాదిస్తున్నానని సోషల్ మీడియాలో పేర్కొంది. దానికి ‘My First Physical Work Experience’ అన్న హ్యాష్ ట్యాగ్ జోడింది. నేను ఉద్యోగాన్ని వీడిన తరువాత సంతోషంగా ఉన్నానని మాత్రం చెప్పగలను అని పేర్కొంది.
Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి
వెయిటర్‌గా ఉన్న లియోనింగ్‌కు చెందిన మహిళ తాను గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నాను. వైట్ కాలర్ ఉద్యోగం ద్వారా నేను సంతృప్తిని పొందలేక పోతున్నాను అని పేర్కొంది. ప్రస్తుతం నా కొత్త పనిలో సంతృప్తిగా ఉన్నాను అని పేర్కొంది. మరో మహిళ కన్సల్టింగ్ ఉద్యోగాన్ని వదలుకొని కాఫీ షాప్‌లో పనిచేస్తోంది. ఇన్నాళ్లు నేను ఏదో వెలితిగా ఉండేదాన్ని, ఇప్పుడు శారీరక శ్రమ నాలో కొత్త శక్తినిస్తోంది, దీంతో పనిచేయడం సరదాగా ఉంది అని పేర్కొంది. అయితే, ఇందుకు ప్రధాన కారణం.. ఉద్యోగులను పలు సంస్థలు యాంత్రికంగా పనిచేయించడంకోసం తీసుకున్నాయని, దీంతో చాలా మంది యువత నిరాశ చెందతుండొచ్చని న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘైలో సోషియాలజీ విభాగం అధ్యాపకులు ఒకరు అభిప్రాయ పడ్డారు.
Anand Mahindra: భారత ఆర్మీ కోసం.. మహీంద్ర వాహనాలు.. మొట్టమొదటిసారి డెలివరీ
గత ఏడాదికాలంగా చైనాలోని యువకులు తమ కొత్త ఉద్యోగం ఫొటోలు, వీడియోలను చైనాయొక్క సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో మై ఫస్ట్ ఫిజికల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ జూన్ 12 నాటికి 30 మిలియన్లకుపైగా వీక్షణలను కలిగి ఉందని బిజినెస్ ఇన్ సైడర్ నివేదించింది.