Anand Mahindra: భారత ఆర్మీ కోసం.. మహీంద్ర వాహనాలు.. మొట్టమొదటిసారి డెలివరీ

డెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Anand Mahindra: భారత ఆర్మీ కోసం.. మహీంద్ర వాహనాలు.. మొట్టమొదటిసారి డెలివరీ

Armado

Anand Mahindra – Army: భారత ఆర్మీ కోసం తయారు చేసిన ఆర్మొర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV)ను తొలి డెలివరీ ఇవాళ చేశామని మహేంద్ర గ్రూప్ (Mahindra Group) ఛైర్మన్ ఆనందర్ మహీంద్ర తెలిపారు. ఇవి భారత మొట్టమొదటి ఏఎల్ఎస్ వాహనాలని వివరించారు.

Armado for Indian armed forces

Armado for Indian armed forces

మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) వీటిని తయారు చేసింది. డెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత సాయుధ దళాల కోసం ఈ వాహనాలను సగర్వంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న మహీంద్ర డిఫెన్స్ ఛైర్మన్ ఎస్పీ శుక్లా, టీమ్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

కాగా, ఈ Armado వాహనాలను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఐదుగురు ప్రయాణికులతో దీన్ని నడిపించవచ్చు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఈ వాహనాలు బాగా ఉపయోగపడతాయి. ఎడారి భూభాగాల్లోనూ దూసుకుపోతాయి. క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా వీటిని వాడుకోవచ్చు. ఆయుధాలను తీసుకెళ్లడం, సరిహద్దుల వద్ద సురక్షితంగా సాయుధ బలగాలు గస్తీ నిర్వహించడం వంటివాటికి ఈ వాహనాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.

Best 5G Phones in India : భారత్‌లో రూ. 15వేల నుంచి రూ. లక్ష 50వేల ధరలో బెస్ట్ 5G ఫోన్‌లు ఇవే.. డోంట్ మిస్..!