Real Estate : ఈ ఆఫ‌ర్ విని పెళ్లికాని ప్ర‌సాదులు క్యూ క‌డ‌తారో ఏంటో ?

సాధార‌ణంగా వ్యాపారులు త‌మ ఉత్ప‌త్తుల సేల్స్‌ను పెంచుకునేందుకు ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు

Chinas property developers are using bizarre marketing tactics

Chinas property developers : సాధార‌ణంగా వ్యాపారులు త‌మ ఉత్ప‌త్తుల సేల్స్‌ను పెంచుకునేందుకు ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అందులో ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం ఒక‌టి. క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను బ‌హుమ‌తులుగా ఇవ్వడం వంటివి చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ ఇచ్చిన ఆఫ‌ర్ గురించి తెలిస్తే నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం. ఇంత‌కీ అంత మంచి ఆఫ‌ర్ ఏంట‌ని అంటారా.. ఇల్లు కొంటే భార్య ఫ్రీ అట‌. అయితే ఇది మ‌న ద‌గ్గ‌ర కాదులెండి పొరుగు దేశం చైనాలో.

ప్ర‌స్తుతం చైనాలో రియ‌ల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్క‌డ ఇళ్లు కొనే వారు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయారు. ఈ క్ర‌మంలో టియాంజ‌న్‌కు చెందిన ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ త‌మ వెంచ‌ర్‌లో ఇళ్ల‌ను అమ్మేందుకు ఇచ్చిన ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌ద‌మైంది. త‌మ వెంచ‌ర్‌లో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి భార్య‌ను ఉచితంగా ఇస్తామ‌నే ప్ర‌క‌ట‌న ఇచ్చింది. టీవీలు, సోష‌ల్ మీడియాలో, వాల్ పోస్ట‌ర్ల‌పై ఈ యాడ్‌ను చూసిన వారు ఇళ్లు కొంటే భార్య‌ల‌ను ఎలా ఫ్రీగా ఇస్తార‌బ్బా అంటూ ఈ ప్ర‌క‌ట‌న పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Viral : వీడిదుంప తెగ‌.. ఒకేసారి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్‌ను ప్రెగ్నెంట్ చేశాడు.. అది చాల‌దు అన్న‌ట్లు..

అటు చైనా ప్ర‌భుత్వ అథారిటీ సంస్థ కూడా ఈ ప్ర‌క‌ట‌న పై సీరియ‌స్ అయింది. ఇలాంటి ప్ర‌క‌ట‌న ఇచ్చినందుకు రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా కూడా విధించింది.

కాగా.. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఓ మెలిక ఉన్న‌ట్లు ఆంగ్ల వార్తా క‌థ‌నాల్లో తెలిపారు. ఇల్లు కొనండి..మీ భార్య‌కు ఇవ్వండి అనే ప‌ద‌బంధానికి సంబంధించిన తెలివైన మెలిక‌గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బెజియంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ కంపెనీ ఇల్లు కొంటే ఏకంగా బంగారు క‌డ్డీల‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.